Imran Khan Case: ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Imran Khan AL Qadir Trust Case: ఇమ్రాన్‌ ఖాన్‌కు అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులో బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన కస్టడీ నుంచి విడుదల కానున్నారు. షరతులతో కూడిన బెయిల్‌ను అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులో మంజూరు చేసింది. పూర్తి వివరాలు ఇలా..   

Written by - Ashok Krindinti | Last Updated : May 12, 2023, 05:09 PM IST
Imran Khan Case: ఇమ్రాన్‌ ఖాన్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Imran Khan AL Qadir Trust Case: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు వారాల పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. కోర్టు విచారణ సందర్భంగా పీటీఐ మద్దతుదారులు కోర్టు బయట హంగామా సృష్టించారు. ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారులు ఇస్లామాబాద్‌లోని శ్రీనగర్‌ హైవేను బంద్ చేశారు. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌ హైకోర్టులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఏం జరిగినా తాను దేశం విడిచి వెళ్లనని విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఇది నా దేశం.. నా సైన్యం.. నా ప్రజలు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 9న ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు నుంచి పాక్ రేంజర్స్ బృందం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్ట్ తరువాత పాక్‌లో భారీస్థాయిలో అల్లర్లు చెలరేగాయి. పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ ఖాన్ అభిమానులు విధ్వంసతం సృష్టించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిప్పంటించి.. ఇమ్రాన్‌ ఖాన్‌ను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆ తరువాత గురువారం ఇమ్రాన్ అరెస్టు చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు పేర్కొంది. అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 

తాజాగా ఇమ్రాన్‌ఖాన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ.. ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్ విడుదల ఉత్తర్వులపై ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాక్‌ సమాచార శాఖ మంత్రి మర్యమ్ ఔరంగజేబ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో మాట్లాడారు. ఈ రోజు పాకిస్తాన్ ఎలా కాలిపోతుందో.. అదేవిధంగా రేపు మీ ఇల్లు కాలిపోతుందని అన్నారు.  

మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌ కేసు  కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే.. ధాని షాబాజ్‌ షరీఫ్‌ మంత్రి మండలి‌ సమావేశాన్ని నిర్వహించారు. శుక్రవారం కూడా తోషాఖానా కేసులో కింది కోర్టులో ఎలాంటి విచారణ జరిగినా.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు స్టే విధించాలని నిర్ణయించినట్లు కోర్టు ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్‌పై ఇప్పటికే వందలాది కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఆయనను ఏదో ఒక కేసులో అరెస్టు చేయాలంటూ పాక్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తోంది. 

Also Read: Indian Railway Facts: ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయా..? ఈ విషయాలు తెలుసుకోండి 

Also Read: MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News