‘కరోనాను ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉంది’

ఇప్పటివరకూ కోటిన్నర మంది కరోనా వైరస్ బారిన పడగా, 6 లక్షలకు పైగా కోవిడ్19 మరణాలు సంభవించడం ఆందోళన పెంచుతోంది. కరోనా ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని WHO చెబుతోంది.

Last Updated : Jul 24, 2020, 02:23 PM IST
‘కరోనాను ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉంది’

కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి ప్రపంచ దేశాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటివరకూ కోటిన్నర మంది కరోనా వైరస్ బారిన పడగా, 6 లక్షలకు పైగా కోవిడ్19 మరణాలు సంభవించడం ఆందోళన పెంచుతోంది. మరోవైపు ఈ ఏడాది కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు లేవని చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organsation) మరో కీలక విషయాన్ని వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ కోసం పలు దేశాలు యతవిధాలా యత్నిస్తున్నాయి. India: 30 వేలు దాటిన కరోనా మరణాలు

అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలు అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలకు కరోనా మహమ్మారిని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో భావిస్తోంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఈ 3 దేశాలు కోవిడ్19ను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసరం విభాగం అధిపతి మైక్ రేయాన్ స్పష్టం చేశారు. బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..

అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు 40లక్షలు దాటిపోయాయి. గంటలకు 2,600 తాజా కేసులు అగ్రరాజ్యంలో నమోదవుతుండటం గమనార్హం. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 49వేలకు పైగా కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు, 740 కరోనా మరణాలు సంభవించాయి. ఇప్పటివరకూ భారత్‌లో 12,87,945 పాజిటివ్ కేసులు (India CoronaVirus Postive Cases) నమోదు కాగా, మొత్తం 30,601 మంది కరోనాతో పోరాడుతూ మరణించారు.వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x