G-20 Summit: కోవిడ్ 19 వ్యాక్సిన్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. రోమ్‌లో ప్రారంభమైన జి 20 శిఖరాగ్రసదస్సులో ప్రధాని మోదీ గ్లోబల్ ఎకానమీ-గ్లోబల్ హెల్త్ అంశంపై మాట్లాడారు. కరోనాపై పోరులో ఇండియా పాత్రను ప్రస్తావించారు.
ఇటలీలో ప్రారంభమైన జి 20 శిఖరాగ్ర సదస్సులో(G-20 Summit)భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ కీలక విషయాల్ని ప్రకటించారు. కోవిడ్ వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ ఉత్పత్తిపై పలు ముఖ్య విషయాలు ప్రస్తావించారు. కోవిడ్‌పై పోరులో ఇండియా పాత్రను వివరించారు. 2022 చివరికి 5 వందల కోట్ల కోవిడ్ 19 వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ఇండియా సిద్ఘంగా ఉందని ప్రధాని మోదీ వివరించారు. ఫలితంగా ఇండియాతో పాటు ఇతర దేశాలకు మేలు జరుగుతుందన్నారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రపంచానికి ఇండియా సహాయం కచ్చితంగా అందుతుందన్నారు. దేశంలో ఇప్పటికే వందకోట్లకు పైగా వ్యాక్సిన్ పంపిణీ జరిగిందన్నారు. జి 20 సదస్సులో గ్లోబల్ ఎకానమీ-గ్లోబల్ హెల్త్ అంశంపై ఆయన మాట్లాడారు.
కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను పరస్పరం గుర్తించే విషయంలో ప్రపంచ దేశాల మధ్య ఒక యంత్రాంగం ఉండాలని సూచించారు. ఇండియాలో దేశీయంగానే అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు(Covaxin)అత్యవసర వినియోగ అనుమతి ప్రక్రియ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ(WHO)వద్ద పెండింగ్‌లో ఉందని మోదీ(PM Narendra Modi) గుర్తుచేశారు. త్వరగా అనుమతి లభిస్తే ఇతర దేశాలకు టీకాల విషయంలో సాయం చేసేందుకు ఆస్కారం ఉంటుందని వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో భారత్ నుంచి 150 దేశాలకు అవసరమైన అత్యవసర ఔషధాలు, వైద్య పరికరాలు పంపించామని గుర్తు చేశారు. మరోవైపు జి 20 తీసుకున్న పలు నిర్ణయాలపై ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. కనిష్ట కార్పొరేట్ ట్యాక్స్‌ను 15 శాతంగా నిర్ధారిస్తూ జి–20 తీసుకున్న నిర్ణయం పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లో సాహసోపేతమైన ఆర్థిక సంస్కరణలను శ్రీకారం చుట్టామన్నారు. కరోనా ప్రభావం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవాలంటే అన్ని దేశాలు కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. కరోనాపై పోరాటంతోపాటు ఆరోగ్య రంగంలో భవిష్యత్తుల్లో తలెత్తబోయే దుష్పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని చెప్పారు.
ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలతో కూడిన జి–20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభంలో అతిథ్య దేశం ఇటలీ(Italy) ప్రధానమంత్రి మారియో డ్రాఘీ ప్రసంగించారు.పేద దేశాలకు కోవిడ్–19 వ్యాక్సిన్లు మరిన్ని అందించాలని జి–20 సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ధనిక దేశాలు, పేద దేశాల మధ్య అంతరం నైతికంగా ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పేద దేశాల్లో ఇప్పటివరకు కేవలం 3 శాతం మందికే పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ జరిగిందని గుర్తుచేశారు. అదే ధనిక దేశాల్లో 70 శాతం మంది కనీసం ఒక్క డోసైనా తీసుకున్నారని తెలిపారు. తక్కువ ఆదాయం కలిగిన దేశాలకు మరింత చేయూత అందించాల్సిన అవసరం ఉందన్నారు. శిఖరాగ్ర సదస్సులో తొలిరోజు ప్రధానంగా ప్రపంచ ఆరోగ్య, ఆర్థిక రంగాలపై చర్చించారు.
Also read; NEET 2021 Results: నీట్ 2021 ఫలితాలు ఇంకెప్పుడు, విద్యార్ధుల్లో రేగుతున్న ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి