Visa Free Policy: ఇప్పటికే పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ఇండోనేషియా ఆ దిశగా మరి కొన్ని చర్యలు తీసుకోనుంది. వీసా ఫ్రీ పాలసీని ప్రవేశపెట్టనుది. ఇండియా సహా 20 దేశాలకు ఈ పాలసీ వర్తించనుంది. కొత్త పాలసీ అమలులోకి వస్తే పర్యాటకం మరింత అభివృద్ధి చెందనుంది.
ఇండోనేషియాలో ప్రభుత్వం మారక ముందే అక్టోబర్ నుంచి కొత్త వీసా పాలసీ అమలు కానుంది ఇండియా సహ 20 దేశాల పర్యాటకులకు వీసా ఇబ్బందులు తొలగించేందుకు ఆ దేశం కొత్త పాలసీ ప్రవేశపెట్టనుంది. ఫలితంగా విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరగవచ్చు. తద్వారా స్వదేశీ ఖర్చులు, విదేశీ పెట్టుబడులు, ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి చెందనుంది. కరోనా మహమ్మారికి ముందు ఇండోనేషియాలో ప్రతి పర్యాటకులు దాదాపుగా 900 డాలర్లు ఖర్చు పెట్టేవాడు. ఇప్పుడు అది 1600 డాలర్లకు పెరిగింది. దేశానికి విదేశీ పర్యాటకుల్ని మరింతగా ఆకర్షించేందుకు 20 దేశాలకు వీసా ఫ్రీ పాలసీ అమలు చేసేందుకు ఇండోనేషియా సిద్ధమౌతోంది.
ప్రతిపాదిత వీసా ఫ్రీ దేశాలు
ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, దక్షిణ కొరియా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, కతార్, యూఏఈ, సౌదీ అరేబియా, నెదర్లాండ్స్, జపాన్, రష్యా, తైవాన్, న్యూజిలాండ్, ఇటలీ, స్పెయిన్ మరో రెండు మద్య ఈశాన్య దేశాలు
ఇండియా సహా ఇతర దేశాల పర్యాటకుల కోసం కొన్ని టూరిస్ట్ వీసా ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. టైప్ బి1 అయితే 30 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది. దీనికి ఖర్చు 2,557 రూపాయలు. పర్యాటక, ఫ్యామిలీ విజిట్, మీటింగ్, కన్వెన్షన్, ఎగ్జిబిషన్ కోసం పనికొస్తుంది. 6 నెలల వాలిడ్ పాస్‌పోర్ట్ ఉండాలి.
టైప్ డి1 అయితే ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. దీనికి 15,344 రూపాయలు ఖర్చవుతుంది. టైప్ డి1 అయితే 5 ఏళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. దీనికి 76,723 రూపాయలు ఖర్చవుతుంది.
Also read: Fatty Liver Drinks: రోజూ ఉదయం ఈ 6 డ్రింక్స్ తాగితే ఫ్యాటీ లివర్ సమస్య మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook