Isrel - Hamas War: ప్రస్తుతానికి పాలస్తీనా ముఖ్య పట్టణం గాజాలో హమాస్ భారీగా దెబ్బతింది. బలమైన నాయకత్వాన్ని కోల్పోయింది. పాలస్తీనీయులకూ భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇజ్రాయెల్‌పై ఇటీవలే క్షిపణులతో దాడి చేసిన ఇరాన్... ప్రతిదాడులెలా ఉంటాయోనని రోజూ ఎదురుచూస్తూ ఉంది. మిగిలిన అరబ్ దేశాల నుంచి ఇరాన్‌కు ఆశించిన మద్దతేమీ లభించటం లేదు. పైగా అవన్ని సున్నీ ముస్లిమ్ దేశాలైతే.. ఇరాన్ సహా పాలస్తీనాలో షియాలో ఆధిపత్యం ఉంది. పైగా హమాస్‌కు ఆయువుపట్టులాంటి యాహ్యా సిన్వర్ కూడా మరణించటం కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఈ టైంలో హమాస్ కోలుకోవటానికి వీలుగా... తెల్లజెండా ఊపమంటుందా? లేక మొండితనంతో యుద్ధాన్ని కొనసాగించటానికే సై అంటుందా అనే దానిపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
యాహ్యా సిన్వర్ మరణంతో హమాస్ కొత్త అధినేత ఎవరవుతారనేదీ కీలకంగా మారింది. కొత్త నేత చర్చలకు మొగ్గు చూపుతారా? లేక ఇలాగే కొనసాగించదలచుకుంటారా అనేది... తదుపరి పరిణామాలను ప్రభావితం చేయనుంది. హమాస్‌లోనే కాల్పుల విరమణ, బందీల విడుదలపై భిన్నాభిప్రాయాలున్నాయనే వాదన వినిపిస్తోంది. తీవ్ర నష్టం జరిగినా.. ఇజ్రాయిలీ పౌరులను విడిచిపెట్టడానికి హమాస్ తీవ్రవాదులు ససేమిరా అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెనక్కితగ్గటమే మేలని కొంతమంది... పోరాటం కొనసాగించాల్సిందేనని మరికొందరు భావిస్తున్నారంటున్నారు.
హమాస్ వద్ద 101 మంది ఇజ్రాయెలీలు ఇంకా బందీలుగా ఉన్నారు. వారి పరిస్థితి ఎలా ఉందో అని ఇజ్రాయెల్ భయపడుతోంది. ఎలాగైన తమ వారిని రక్షించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇదిలా ఉంటే యుద్ధం ముందుకు సాగుతుందా... ఆగిపోతుందా అనేది బందీల విషయంలో హమాస్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉండనుంది. హమాస్ స్వాధీనంలో ఉన్న ఇజ్రాయెల్ బందీలకు ఏమైనా జరగరానిది జరిగితే... పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత విషమించే ప్రమాదం ఉందనేది అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
హమాస్ దాడికి ముందు స్వదేశంలో రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు... ఇప్పుడు యుద్ధం కారణంగా రోజురోజుకూ తన పరిస్థితిని బలపర్చుకుంటున్నారు. నిరుడు అక్టోబరు 7న హమాస్ అనూహ్య దాడితో ఆయనపై ఇజ్రాయిల్ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అనంతరం గాజాపై, లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడటం ద్వారా నాటి భద్రతా వైఫల్య ఆగ్రహాన్ని ప్రజల మనసుల నుంచి చెరిపేయటానికి నెతన్యాహు ప్రయత్నిస్తున్నారు. హమాస్, హెజ్‌బొల్లా, హౌతీలకు చెందిన కీలక నేతల్ని ఒకరి తర్వాత ఒకరిని విజయవంతంగా హతమార్చటంతో మళ్లీ ఆయన ప్రభావం దేశంలో పుంజుకుంటోంది. పైగా...రెండు అతివాద యూదు పార్టీల మద్దతుతో ఆయన పదవిలో కొనసాగుతున్నారు. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంటే ఆ రెండు పార్టీలు మద్దతు ఉపసంహరించే అవకాశముంది.
హమాస్‌ను పూర్తిగా రూపుమాపటమే తమ లక్ష్యమని ప్రతినపూని మరీ సాగుతున్నారు నతన్యాహు. అయితే అది అంత సులభం కాదని ఆయనకూ తెలుసు.సిన్వర్ మరణం నేపథ్యంలో ఇకనైనా యుద్ధం విరమించి... బందీలను విడిపించాలని వారి బంధువుల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. వాటిని ఇజ్రాయెల్ ప్రభుత్వం అంతగా పట్టించుకునే పరిస్థితి కనిపించటం లేదు.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.