Afghanistan: మరోసారి అఫ్గనిస్తాన్‌లో మారణహోమం జరిగింది. అఫ్గనిస్తాన్‌లో ప్రజల పరిస్థితి మరీ దారుణంగా మారిందనే చెప్పవచ్చు. ప్రపంచ దేశాలు భయపడ్డ విధంగానే అఫ్గాన్ లో మృత్యు డంకాలు మోగుతున్నాయి.
తాజాగా నార్త్ అఫ్గనిస్తాన్‌లో (Afghanistan) భారీ పేలుళ్లు సంభవించాయి. కుందూస్ నగరంలోని షియా మసీదులో భారీ పేలుడు చోటుచేసుకుంది.దీంతో దాదాపు 100 మందికి పైగా మరణించారని, అనేక మంది గాయపడ్డారని తెలుస్తుంది. భారీ పేలుళ్ల కారణంగా పెద్ద శబ్దాలు వినిపించాయని అక్కడి ప్రత్యక్ష సాక్ష్యులు తెలుపుతున్నారు. వందల శవాలు మసీదులో చెల్లాచెదుగా పడ్డాయని.... క్షతగాత్రుల ఆర్త నాదాలతో ఆ ప్రదేశం భయంకరంగా మారిపోయిందని సమాచారం.
Also Read: Samantha Emotional Post: "నాపై వ్యక్తిగత దాడి సమంజసం కాదు": సమంత ఎమోషనల్ పోస్ట్
My condolences to the loved once of the victims at the #KunduzBlast. This #TerrorAttack is strongly condemnable. It's very sad that this all will be a daily routine for so many in #Afghanistan. So many people had to die! May they souls rest in peace pic.twitter.com/0ZuZyFd2Ny
— Jessica Kröner (@KroenerJess) October 8, 2021
శుక్రవారం ప్రజలు మసీదుకు (mosque) వెళ్లి ప్రార్థనలు జరుపుతుండగా ఈ పేలుళ్లు సంభవించాయని తెలుస్తుంది. దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్‌గా (Islamic State of Khorasan) పలు అనుమానాలు వ్యక్తి అవుతున్నాయి. ఏది ఏమైనా ఈ బాబు పేలుడులో దాదాపు 100 మందికి పైగా మృత్యువాత పడటం ప్రపంచ దేశాలను విచారానికి గురి చేస్తుంది.
#Kunduzblast kills 100 and injured 200 at Shia mosques in Kunduz. pic.twitter.com/ZRWl18PXbB
— Aimal Ayubi (@Infamousluv) October 8, 2021
కొన్ని రోజులుగా షియాలకు ఐసిస్ ఖొరాసాన్ హెచ్చరికలు చేయటం.. ఐసిస్ ఖొరాసాన్.. తాలిబన్ల నాయకుడి తలనరికిన విషయం తెలిసిందే.
#AFP reports that an apparent bomb attack on worshippers at a #Shiite mosque in the Afghan city of #Kunduz killed at least 50 people Friday, in the bloodiest assault since US forces left the country.#KunduzBlast pic.twitter.com/jGvgQXWsuF
— Rehmat Mehsud (@RehmatMehsuds) October 8, 2021
Also Read: Konda Polam Movie Review: వైష్ణవ్‌తేజ్ నటించిన 'కొండ పొలం' సినిమా రివ్యూ
ఈ ఘటనపై స్పందించిన తాలిబన్ల ముఖ్య అధికార ప్రతినిధి జాబిహుల్లా ముజాహిద్ స్పందించారు.. "మరణాలు పెద్ద సంఖ్యలో సంభవించింది, అనేక మంది గాయాలపాలయ్యారు, తాలిబన్ల ప్రత్యేక బలగాలు ఘటన స్ధలాన్ని చేరుకొని, క్షయతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు.. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతుందని" తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి