New York Declares State Of Emergency: అమెరికాలో కొత్త రకం కరోనా వైరస్ కేసులు పెరుగుతోన్న వేళ్ల న్యూయార్క్ నగరంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఆరోగ్య అధికారుల వివరాల మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ క్యాథీ హోచుల్ ఈ ప్రకటన చేశారు.
"ఏప్రిల్ 2020 నుంచి ఎప్పుడు చూడని విధంగా న్యూయార్క్ నగరం కొవిడ్ ను ఎదుర్కొంటోంది. గత నెలతో పోల్చుకుంటే రోజుకు 300 మంది ఆస్పత్రిలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో నేటి (శనివారం) నుంచి వచ్చే ఏడాది అంటే 2022 జనవరి 15 వరకు నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడమైనది” అని న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ అన్నారు.
సౌతాఫ్రికాలోని ఇటీవలే కొత్తగా వ్యాప్తి చెందుతోన్న ఓమిక్రాన్ వేరియంట్ ఆందోళన నేపథ్యంలో న్యూయార్క్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించక తప్పదని క్యాథీ హోచుల్ వెల్లడించారు. ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో యూనైటెడ్ స్టేట్స్, యూనైటెడ్ కింగ్ డమ్, కెనడాతో పాటు అనేక యూరోపియన్ దేశాల్లో ప్రయాణికులకు ఆంక్షలు ఆయా దేశాలు విధించాయి.
Also Read: Omricon: కరోనా కొత్త వేరియంట్‌కు 'ఒమ్రికాన్'గా పేరు-బోత్సువానాలో మొదలై బెల్జియం వరకు
Also Read: Bus Crash: సెంట్రల్ మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం...19 మంది మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook