స్కూల్‌లో విచక్షణారహిత కాల్పులు, ఓ విద్యార్థి మృతి, పలువురికి తీవ్ర గాయాలు

తుపాకీ విష సంస్కృతికి అగ్రరాజ్యంలో అడ్డాగా మారింది. విద్యార్ధులే లక్ష్యంగా చేసుకొని కాల్పలు జరిపిన  మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 

Last Updated : May 8, 2019, 12:51 PM IST
స్కూల్‌లో విచక్షణారహిత కాల్పులు, ఓ విద్యార్థి  మృతి, పలువురికి తీవ్ర గాయాలు

అమెరికా: హాయిలాండ్స్ లోని  సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ మ్యాథ్స్ (ఎస్ టి.ఈ.ఎం)  స్కూల్ లో కాల్పుల కలకలం రేగింది.  క్లాస్ రూంలోకి ప్రవేశించిన దండగులు  విచక్షణా రహిత కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఓ విద్యార్ధి అక్కడి కక్కడే మృతి చెందగా మరో ఏడుగురు విద్యార్ధులకు గాయాలయ్యాయి.

క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తలించి చికిత్సనందిస్తున్నారు.  గాయపడ్డ విద్యార్ధుల పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు పేర్కొన్నారు. ఈ కాల్పుల ఈ ఘటన డెన్వర్ ప్రాంతంలోని సమీపంలో 40 కి.మీ దూరంలో అక్కడి కాలమానం ప్రకారం నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో చోటు చేసుకుంది. 

తాజా ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. తోటి విద్యార్థులే ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని ప్రాధమికంగా నిర్ధారించారు . విచారణ అనంతరం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కాగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

నెల రోజుల వ్యవధిలో అమెరికాలోని, శాండియోగో, వెస్ట్‌బాల్టిమోర్‌లో ఇటీవలె జరిగిన ఘటనల్లో పదు సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఓ విశ్వవిద్యాయంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. తాజా ఘటనల నుంచి తేరుకోకముందే మరో దాడి జరగడం గమనార్హం.

Trending News