పాక్ ఆ సిస్టం కోసం.. చైనాకి ఎంత డబ్బిచ్చింది?

చైనా అత్యంత శక్తిమంతమైన మిసైల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను పాకిస్తాన్‌కి అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి.

Last Updated : Mar 22, 2018, 06:23 PM IST
పాక్ ఆ సిస్టం కోసం.. చైనాకి ఎంత డబ్బిచ్చింది?

చైనా అత్యంత శక్తిమంతమైన మిసైల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను పాకిస్తాన్‌కి అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఆ సిస్టమ్‌ను కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ ఎంత డబ్బు చైనాకి చెల్లించిందో మాత్రం బహిర్గతమవలేదు. కొత్త మిసైల్స్ టెస్టింగ్ చేయడం కోసం.. ఈ మిసైల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను పాకిస్తాన్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. భారతదేశంలో సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ బ్రహ్మోస్‌ని టెస్ట్ చేసిన రోజునే ఈ వార్త వచ్చింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వేరే దేశంతో ఇలాంటి డీల్ చేసుకోవడం చైనాకి తొలిసారి కావడం గమనార్హం.

అయితే పాకిస్తాన్ మిసైల్స్ రంగంలో సాధించే పురోగతికి తమవంతు సహాయం చైనా ఎప్పటి నుండో చేస్తుందనే వార్తలు కొట్టివేయలేమని పలువురు ప్రపంచ స్థాయి రాజకీయ మేధావులు అంటున్నారు. ఇటీవలే ఇరుదేశాల మధ్య ఒప్పందం జరిగాక చైనా సిబ్బంది... సిస్టమ్‌ను అమర్చడానికి  పాకిస్తాన్ వెళ్లినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఇదే అంశంపై హాంగ్ కాంగ్ పత్రిక సౌత్ చైనా మార్నింగ్ పోస్టు వార్తా కథనాన్ని ప్రకటించింది. పాకిస్తాన్ చైనా నుండి ఈ సహాయం పొందిన దానికి ప్రతిఫలంగా భారీగానే చెల్లింపులు కూడా వార్తలొస్తున్నాయి

Trending News