Pakistan Debt: పాకిస్థాన్ ఆర్థిక పరిస్థతి రోజురోజుకీ దిగజారుపోతుంది. దేశాన్ని ముందుకు నడిపించడానికి కావాల్సిన ధనం ప్రభుత్వం వద్ద లేదని స్వయంగా దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran khan) వెల్లడించారు. రానురాను ఆర్థిక వ్యవస్థ నడిపించేందుకు విదేశాల మీద ఆధారపడుతున్న పాకిస్థాన్ అప్పుల (Pakistan Debt) ఊబిలోకి కూరుకుపోతుంది. గత నాలుగు నెలల్లో ప్రభుత్వం 3.8బిలియన్ డాలర్లు అప్పు చేసింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ (State Bank of Pakistan)బుధవారం విడుదల చేసిన వివరాలు.. పాక్ బాకీలను స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పాక్ అప్పులు రూ. 50 లక్షల కోట్లు (Pakistan Debt) దాటినట్లు ఎస్బీపీ తన నివేదికలో వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రధాని బాధ్యతలు చేపట్టాక ఈ పరిస్థితి (Pakistan Debt) మరింత దిగజారినట్లు తెలుస్తోంది. బాకీ ఉన్న రూ.50.5 లక్షల కోట్లలో రూ.20 లక్షల కోట్లు ఇమ్రాన్ ఖాన్ హయాంలోనే పెరిగినట్లు ఎస్బీపీ తెలిపింది.
Also Read: Imran Khan: 'దేశాన్ని నడిపించేంత డబ్బు ప్రభుత్వం వద్ద లేదు': ఇమ్రాన్ ఖాన్
గడిచిన 39 నెలల్లో 70శాతం అప్పులు పెరిగాయని స్థానిక మీడియా తెలిపింది. 2018 జూలై నుంచి 2021 జూన్ మధ్య రూ.14.9 లక్షల కోట్ల రుణాన్ని పాక్ ప్రభుత్వం పొందినట్లు సమాచారం. అప్పుల ఊబి నుంచి పాకిస్థాన్ బయటపడాలంటే ప్రజలు పన్నులు చెల్లించాలని ప్రధాని ఇమ్రాన్ విజ్ఞప్తి చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook