Space Tourism: మనిషి నివసిస్తున్న, మనుగడ సాగిస్తున్న భూమిని పరిరక్షించుకోవడం ముఖ్యమా లేదా ఇతర గ్రహాలవైపు ఆశలు పెట్టుకోవడం మంచిదా. ప్రిన్స్ విలియమ్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశానికి ప్రాధాన్యత చేకూరుస్తున్నాయి. అదేంటో పరిశీలిద్దాం.
ఆధునికత అందిస్తున్న సరికొత్త సాంకేతికత, మనిషి ఆలోచన శైలి కొత్త ఆవిష్కరణలు దారి తీస్తోంది. అదే సమయంలో కొత్త సవాళ్లను సృష్టిస్తోంది. ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ అవుతున్న అంశం పర్యాటకం. ప్రపంచంలోని కుబేరులంతా ఇప్పుడు అంతరిక్షంపైనే దృష్టి సారించారు. వరుస ప్రయోగాలతో స్పేస్ టూరిజంపై(Space Tourism) ప్రపంచాన్ని నమ్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి వ్యూహాలు వారివున్నా..స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk)ఇప్పటికే ఓ అడుగు ముందుకేశారు. వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్, స్పేస్‌ఎక్స్ సంస్థలు ప్రైవేటు వ్యక్తుల్ని అంతరిక్షంలోకి పంపుతూ రోదసీ యాత్రలకు శ్రీకారం చుట్టాయి. రిచర్డ్ బ్రాన్సన్, జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్‌లు ఆ దిశగా అడుగులేస్తున్నారు.
ఈ క్రమంలోనే రెండవ క్వీన్ ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ విలియమ్(Prince William)కీలక వ్యాఖ్యలు చేశారు. స్పేస్ టూరిజంపై అసహనం వ్యక్తం చేయడం సంచలనం కల్గిస్తోంది. ప్రపంచంలోని టాప్ బ్రెయిన్స్ అంటే గొప్ప మేధస్సు కలిగినవాళ్లు..ఆకాశం వైపు చూడటం మానేసి, నేలపై ఫోకస్ పెట్టాలని వ్యాఖ్యానించారు. ఇతర గ్రహాలపై వెళ్లి అక్కడ బతకాలనే విషయాలపై ఫోకస్ పెట్టడానికి బదులు..భూమిని పరిరక్షించుకోవడం, భూమి గాయాల్ని మాన్పించేందుకు ప్రయత్నించడం మంచిదని కోరారు. విలువైన మేధా సంపత్తిని సంపాదన కోసం కాకుండా సమాజ హితం కోసం కేటాయించాలని ప్రిన్స్ విలియమ్ విజ్ఞప్తి చేశారు. వచ్చే నెలలో సీవోపీ 26 క్లైమేట్ సమ్మిట్ జరగనున్న నేపధ్యంలో విలియమ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
90 ఏళ్ల నటుడు షాట్నర్ బ్లూ ఆరిజిన్ అంతరిక్ష యానం పూర్తయిన కొద్దిసేపటికే ప్రిన్స్ విలియమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అంతరిక్ష యాత్రలతో స్పేస్ టూరిజంను(Space Tourism)అభివృద్ధి చేస్తున్న ధనికులపై మైక్రోసాఫ్ట్ అధినేత ఓ టీవీ షోలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూమ్మీద ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే రోదసీ యాత్రల్ని చేపట్టడం సరికాదన్నారు. మలేరియా, హెచ్ఐవీ వంటి వ్యాధులు ఇంకా అంతం కాలేదని గుర్తు చేశారు. తనకెప్పుడూ ఈ వ్యాధులు భూమి పైనుంచి ఎప్పుడు దూరమవుతాయనే బాధే వేధిస్తుంటుందని బిల్‌గేట్స్(Bill Gates)తెలిపారు. ఇలాంటి సమయంలో స్పేస్ టూరిజంపై దృష్టి పెట్టడం మంచిది కాదన్నారు.
Also read: IRCTC Samudram Tour Details: కపుల్స్ కోసం ఐఆర్‌సీటీసీ సముద్రం అందిస్తున్న అద్భుత ప్యాకేజ్ వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook