అంగరంగ వైభవంగా రాజ వివాహం

బ్రిటన్ యువరాజు హ్యారీ(33), హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్(36) వివాహం శనివారంఅంగరంగ వైభవంగా జరిగింది.

Last Updated : May 20, 2018, 12:26 PM IST
అంగరంగ వైభవంగా రాజ వివాహం

బ్రిటన్ యువరాజు హ్యారీ(33), హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్(36) వివాహం శనివారంఅంగరంగ వైభవంగా జరిగింది. విండర్స్ క్యాజిల్ లో జరిగిన ఈ రాజ కుటుంబ వేడుకలో బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2 హాజరయ్యారు. బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, హాలీవుడ్‌ నటుడు జార్జి క్లూనీ, సాకర్‌ ఆటగాడు డేవిడ్‌ బెక్‌హామ్‌ సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. మార్కల్‌కు హ్యారీ బంగారు ఉంగరం తొడగ్గా, హ్యారీకి మార్కల్‌ ప్లాటినం ఉంగరం తొడిగారు.

 

అనంతరం దంపతులు గుర్రపు బగ్గీలో విండ్సర్‌ ప్రాంతమంతా కలియతిరుగుతూ.. ప్రజలను పలకరించారు.  హ్యారీ–మార్కల్‌కు రాణి ఎలిజబెత్‌ 2 సస్సెక్స్‌ డ్యూక్, సస్సెక్స్‌ డచెస్‌ బిరుదులు ప్రదానం చేశారు. హ్యారీ కంటే వయసులో మూడేళ్ల పెద్దదైన మేఘన్ కు ఇది రెండో వివాహం. తొలిసారి వివాహమైన 3 సంవత్సరాల తరువాత ఈమెకు విడాకులయ్యాయి.కాగా.. మేఘన్‌, ప్రిన్స్‌లను భార్యభర్తలుగా జస్టిన్ వెల్బీ అధికారికంగా ప్రకటించారు. వీరి వివాహ వార్త అధికారికంగా ప్రకటించగానే చర్చి వెలుపల సంబరాలు మిన్నంటాయి.

 

Trending News