NASA about Asteroid 2020 SW: స్కూల్ బస్సు సైజ్ ఉన్న ఓ గ్రహశకలం ( Asteroid) గురువారం నాడు ( సెప్టెంబర్ 24) భూమికి దగ్గరిగా రానున్నట్టు అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా ( NASA ) వెల్లడించింది. టక్సన్‌లోని ఆరిజోనా యూనివర్శిటీకి చెందిన క్యాటలినా స్కై సర్వే ఈ ఆస్టరాయిడ్‌ని గుర్తించింది. శాస్త్రవేత్తలు 2020 SW అనే పేరుతో పిలుస్తున్న ఈ ఆస్టరాయిడ్ భూ ఉపరితలంపై 22,000 కి.మీ దూరం నుంచి వెళ్లనుందని నాసా పేర్కొంది. నాసా వెల్లడించిన వివరాల ప్రకారం భూమికి 36,000 కి.మీ దూరంలో ఉన్న జియోస్టేషనరి శాటిలైట్స్ ( geostationary satellites ) రింగ్ కంటే తక్కువ ఎత్తులోనే ఈ ఆస్టరాయిడ్ ప్రయాణించనుందన్న మాట. Also read : Viral Video: అతడే అసలైన హీరో.. నెటిజన్ల ప్రశంసలు
ఈ 2020 SW Asteroid 15-30 అడుగులు ( 10 మీటర్లు ) ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాస్త అటు ఇటుగా మినీ స్కూల్ బస్ సైజులో ఉండే ఈ గ్రహశకలంతో భూ గ్రహానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమికి సమీపం నుంచి వెళ్లే ఈ గ్రహశకలం భూమికి ఎటువంటి హాని తలపెట్టదని ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అది భూమికి సమీపంగా వచ్చినప్పటికీ.. వాతావరణంలో ఎత్తులో ఉండగానే ముక్కలుగా విచ్చిన్నమై మెరిసే ఉల్కల్లా ( bright meteor ) కనపడతాయని నాసా తెలిపింది.
విశ్వంలో ఇలాంటి గ్రహ శకలాలు ( Asteroids in space ) ఎన్నో ఉన్నాయని... వాటిలో ఎన్నో గ్రహ శకలాలు ఎన్నోసార్లు భూమికి సమీపంగా వస్తుంటాయని.. వాటి వల్ల భూమికి పెద్ద ప్రభావం ఏమీ ఉండదని సెంటర్ ఫర్ నీయర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ స్టడీస్ (CNEOS) డైరెక్టర్ పాల్ చోడస్ తెలిపారు. దక్షిణ క్యాలిఫోర్నియాలో నాసాకు చెందిన జెట్ ప్రపల్షన్ ల్యాబోరేటరీ కేంద్రంగా ఈ సంస్ధ తమ పరిశోధనలు చేస్తోంది. Also read : Crab Smoking Video: దర్జాగ సిగరెట్ తాగుతున్న పీత : నెటిజన్లు షాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe