Sunita Williams to return from space in 2025: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ గురించి నాసా కీలక విషయాన్ని వెల్లడిచింది. వారు అంతరిక్షం నుండి ఎప్పుడు తిరిగి వస్తారో నాసా వెల్లడించింది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వచ్చే ఏడాది అంటే ఫిబ్రవరి 2025లో భూమికి తిరిగి వస్తారని నాసా తెలిపింది. కాగా బోయింగ్ కంపెనీకి చెందని స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ను కేవలం పది రోజుల అంతరిక్ష యాత్ర కోసం ఈ సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రయోగించారు.
అయితే అందులోని థ్రస్టర్ పనితీరు దెబ్బతినడంతో హీలియం లీకేజీ జరుగుతోంది. ఈ సమస్యల వల్ల స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ను తాత్కాలికంగా ఐఎస్ఎస్ కు అనుసంధానం చేశారు. ఐఎస్ఎస్ నుంచి ఇప్పుడు సనీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్ లకు అన్ని సౌకర్యాలను అందిస్తున్నారు. వారు అక్కడికి చేరుకుని ఇప్పటికి 80 రోజులు పూర్తయిన సంగతి తెలిసిందే.
Spaceflight is risky, even at its safest and most routine. A test flight, by nature, is neither safe nor routine. Our decision to keep Butch and Suni aboard the Space Station and bring Starliner home uncrewed is the result of our commitment to safety: our core value. https://t.co/xfgEKFRY2f
— Bill Nelson (@SenBillNelson) August 24, 2024
శనివారం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..ఆ ఇద్దరు వ్యోమగాములు భూమికి తిరిగివచ్చేది వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనేఅని తెలిపింది. అంటే మరో 6 నెలలు సునితా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్ అక్కడే ఉంటారు. వారిద్దరి ఆరోగ్యం, స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ పునరుద్ధరణపై పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ తరపు నుంచి క్రూ 9 మిషన్ ద్వారా పలువురు వ్యోమగాములు ఈ ఏడాది సెప్టెంబర్ 24వ తేదీ అంతరిక్షంలోకి వెళ్తారు. వారంతా కూడా 2025 ఫిబ్రవరిలోనే తిరిగి భూమి మీదకు చేరుకుంటారు. ఆ సమయంలోనే వారితో కలిసి సునీతా విలియమ్స్ కూడా వస్తారు.
'స్టార్‌లైనర్ థ్రస్టర్' కోసం ఇంజనీర్లు కొత్త కంప్యూటర్ మోడల్‌ను విశ్లేషిస్తున్నారని ఇటీవల నాసా తెలిపింది. తుది నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతి రకమైన ప్రమాదాన్ని విశ్లేషిస్తామని నాసా తెలిపింది. అంతరిక్షంలో, భూమిపై థ్రస్టర్ యొక్క విస్తృతమైన పరీక్షలో స్టార్‌లైనర్ వ్యోమగాములను సురక్షితంగా తిరిగి పంపగల సామర్థ్యాన్ని కలిగి ఉందని ఈ నెల ప్రారంభంలో బోయింగ్ తెలిపింది. బోయింగ్‌లో సిబ్బందితో కలిసి ఇది మొదటి టెస్ట్ ఫ్లైట్. 'స్పేస్ షటిల్' సేవ నుండి ఉపసంహరించుకున్న తర్వాత, నాసా అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తరలించే పనిని బోయింగ్ , స్పేస్‌ఎక్స్‌లకు అప్పగించింది. 'SpaceX' 2020 నుంచి ఈ పని చేస్తోంది.
Also Read :Pension Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.