Tanzania Plane Crash: వర్షం దెబ్బకు సరస్సులోకి దూసుకెళ్లిన విమానం.. టాంజానియాలో ఘోర ప్రమాదం!

Tanzania Plane Crash News in telugu: టాంజానియా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది, టాంజానియాలోని విమానాశ్రయంలో ప్యాసెంజర్ ఫ్లయిట్ ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పి లేక్స విక్టోరియాలో కూలిపోయింది.

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 6, 2022, 04:24 PM IST
Tanzania Plane Crash: వర్షం దెబ్బకు సరస్సులోకి దూసుకెళ్లిన విమానం.. టాంజానియాలో ఘోర ప్రమాదం!

Tanzania Plane Crash In Lake Victoria: టాంజానియా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది, ఆదివారం, టాంజానియాలోని విమానాశ్రయంలో ప్రయాణికులు విమానం ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పి సరస్సులో కూలిపోయింది. ప్రెసిషన్ ఎయిర్‌లైన్స్ దేశీయ విమానాన్ని బుకోబా ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ చేయబోతుండగా పైలట్ నియంత్రణ కోల్పోయాడని, దీంతో ఎయిర్‌పోర్ట్ సమీపంలోని విక్టోరియా లేక్ లో ఆ విమానం పడిపోయిందని సమాచారం.

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. ప్రమాదం జరిగిన సమయంలో భారీ వర్షం కురుస్తూ ఉండగా బలమైన గాలులు వీచాయని అంటున్నారు. బుకోబా విమానాశ్రయం ఆఫ్రికాలోని అతిపెద్ద సరస్సు అయిన విక్టోరియా సరస్సు ఒడ్డున ఉంది. ప్రెసిషన్ ఎయిర్ టాంజానియాలో అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థ అని తెలుస్తోంది.

ఈ విమానంలో 49 మంది ప్రయాణికులు ఉన్నారని ఇప్పటి వరకు వీరిలో 23 మంది ప్రయాణికులను రక్షించారని అంటున్నారు. ఇక ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. BBC న్యూస్ ఆఫ్రికా రిపోర్ట్ చేసిన వివరాల ప్రకారం  మ్వాంజా నుండి బుకోబాకు నడుస్తున్న దేశీయ విమానంలో 49 మంది ప్రయాణికులు ఉన్నారని, ఇప్పటివరకు 23 మందిని రక్షించారని అంటున్నారు. 

Also Read: Nithin- Chiranjeevi: 'భీష్మ' స్నేహాన్ని కాదనుకోలేక..చిరు కాదన్న కథతో రిస్క్ చేస్తున్న నితిన్!

Also Read: Pooja Hegde Leg Injury : పూజా హెగ్డే కాలికి గాయం.. కోలుకుంటోన్న బుట్టబొమ్మ.. పిక్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News