Prostitution: ఒకే రోజు 17 మంది పురుషులు... టీనేజ్ యువతితో బలవంతంగా వ్యభిచారం...

Escort forces girl into Prostitution: యూకెలో దారుణం వెలుగుచూసింది. 23 ఏళ్ల ఓ వ్యభిచారిణి 16 ఏళ్ల టీనేజ్ యువతిని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 2, 2022, 05:26 PM IST
  • యూకెలో వెలుగుచూసిన దారుణం
  • టీనేజ్ యువతిని బలవంతంగా వ్యభిచారంలోకి
  • నిందితురాలికి 16 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు
Prostitution: ఒకే రోజు 17 మంది పురుషులు... టీనేజ్ యువతితో బలవంతంగా వ్యభిచారం...

Escort forces girl into Prostitution: యూకెలో దారుణం వెలుగుచూసింది. 23 ఏళ్ల ఓ వ్యభిచారిణి 16 ఏళ్ల టీనేజ్ యువతిని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపింది. తన వద్ద తీసుకున్న డబ్బులు చెల్లించేందుకు గాను ఆమెను కూడా వ్యభిచారిణిగా మార్చింది. ఏకంగా ఒకే రోజు 17 మంది పురుషుల వద్దకు ఆ టీనేజ్ యువతిని పంపించింది. 'ది సన్' ప్రచురించిన కథనంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆ కథనం ప్రకారం.. యూకెలోని సండర్‌ల్యాండ్‌కి చెందిన టైలర్ జో వాకర్ (23) అనే వ్యభిచారిణి కొద్దిరోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 16 ఏళ్ల టీనేజ్ యువతికి గాలం వేసింది. తరచూ చాట్ చేస్తూ ఆమెకు దగ్గరైంది. ఈ క్రమంలో యువతికి కొంత డబ్బు కూడా ఇచ్చింది. ఇదే క్రమంలో ఓరోజు యువతిని తన అపార్ట్‌మెంట్‌కు పిలిపించింది. తానే ట్యాక్సీ బుక్ చేసి డబ్బులు కూడా చెల్లించింది.

యువతి తన అపార్ట్‌మెంట్‌కు వచ్చాక.. తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలని వాకర్ ఆమెను కోరింది. యువతి వద్ద డబ్బులు లేకపోవడంతో.. వ్యభిచారం చేసి తన అప్పు తీర్చాలని డిమాండ్ చేసింది. ఇందుకోసం మొదట ఆ యువతిని వివస్త్రగా చేసి ఫోటోలు తీసింది. ఆ ఫోటోలను ఫోన్ ద్వారా పలువురికి ఫార్వార్డ్ చేసింది.

ఈ క్రమంలో కొందరు విటులు వాకర్‌ను ఆశ్రయించగా... ఆ యువతిని బలవంతంగా వ్యభిచారం చేయించింది. మొదట ఓ విటుడిని యువతి గదిలోకి పంపించినప్పుడు... తాను ఇలాంటి పనులు చేయలేనని వాకర్‌తో ఆమె వాపోయింది. కానీ వాకర్ మాత్రం ఆమె మాట వినిపించుకోలేదు. తప్పదు.. నువ్వు చేయాల్సిందే.. లేకపోతే డబ్బులు ఎలా సంపాదించగలవు.. అంటూ యువతిపై మండిపడింది. అలా ఒకేరోజు 17 మంది పురుషులతో వ్యభిచారం చేయించింది. దీనిపై బాధిత యువతి కోర్టును ఆశ్రయించగా... కేసును విచారించిన న్యాయస్థానం తాజాగా టైలర్ జో వాకర్‌కు 16 నెలల జైలు శిక్ష విధించింది. 

Also Read: Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి గుండెపోటుతో మృతి!

SRH Kane Williamson: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ నిరసన.. బీసీసీఐ వద్దకు చేరిన కేన్‌ 'క్యాచ్‌' పంచాయతీ!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News