Indian Student killed In Ukraine: రష్యా మిస్సైల్ దాడిలో ఉక్రెయిన్​లోని భారత విద్యార్థి మృతి

Indian Student killed In Ukraine: రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధంలో ఓ భారతీయడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఉదయం జరిగిన మిస్సైల్​ దాడిలో ఉక్రెయిన్​లో ఉంటున్న ఓ మెడికల్​ విద్యార్థి మృతి చెందాడు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2022, 04:40 PM IST
  • ఉక్రెయిన్​లో భారత విద్యార్థి మృతి
  • రష్యా మిస్సైల్ దాడిలో ఘటనలు దుర్మరణం
  • ధృవీకరించిన భారత విదేశాంగ శాఖ
Indian Student killed In Ukraine: రష్యా మిస్సైల్ దాడిలో ఉక్రెయిన్​లోని భారత విద్యార్థి మృతి

Indian Student killed In Ukraine: ఉక్రెయిన్​లో విషాదం చోటు చేసుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించింది.

ఏ ఒక్క భారతీయుడుకి కూడా రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రమాదం బారిన పడకుండా.. తరలింపు చేపట్టింది ప్రభుత్వం. అయినప్పటికీ ఓ విద్యార్థి ఇలా ప్రాణాలు కోల్పోవడం విచారకరమని విదేశంగ శాఖ పేర్కొంది.

మృతుడి వివరాలు..

ఈ ఉదయం ఖర్కేవ్​పై జరిగిన రష్యా మిస్సైల్ దాడిలో.. కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని విచారణంతో ధృవీకరిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి ట్విట్ట్ ద్వారా వెల్లడించారు.

ఈ ఘటనతో రష్యా, ఉక్రెయిన్ రాయబారులను పిలిచి.. దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో ఉన్న భారత పౌరులను సురక్షితంగా తరలించాదుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు.

వెంటనే కీవ్​ను వీడండి..

రష్యా దాడుల్లో ఓ భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఉక్రెయిన్​లోని భారత రాయబార కార్యాలయం.. భారత పౌర్లకు అడ్వైజరీ జారీ చేసింది. దాడులు తీవ్ర రూపంలో దాల్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో భారత పౌరులంతా కీవ్​ నగరాన్ని వీడాలని సూచించింది. వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పేర్కొంది.

ఇప్పటికే ఉక్రెయిన్లో చిక్కుకున్న భారత పౌరులను స్వదేశానికి సురక్షితంగా రప్పించేందుకు కేంద్రం ఆపరేషన్ గంగాను చేపట్టింది. ఇప్పటికే వందల సంఖ్యలో విద్యార్థులు, ఇతర పౌరులను ఉక్రెయిన్​ నుంచి వెనక్కి రప్పించింది. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.

తాజాగాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాయు సేన ఆపరేషన్ గంగాలో పాల్గొనాలని విజ్ఞప్తి కూడా చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఆపరేషన్​ గంగాను మరింత వేగంగా అమలు చేసే అవకాశముంది.

Also read: Viral Video: ఒంటి చేత్తో యుద్ధ ట్యాంక్‌ని ఆపేసిన ఉక్రెయిన్ వాసి, వీడియో వైరల్

Aslo read: Model Offer: ఉక్రెయిన్‌తో యుద్ధం చేయని వారితో పడుకోవడానికి సిద్ధం.. రష్యా సైనికులకు మోడల్ బంపర్ ఆఫర్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News