Israel Vs Hamas War: గొప్ప మనసు చాటుకున్న అమెరికా.. విమానం, ట్రక్కులలో ఆహారం, మందుల పంపిణి..

US President Joe Biden: గాజాలోని ప్రజలకు పెద్ద ఎత్తున విమానం, ట్రక్కులలో ఆహారం, నిత్యావసరాల సరుకులు, మందులను పంపిణి చేయడానికి సిద్ధపడినట్లు అమెరికా ప్రెసిడెంట్ జోబిడెన్ ప్రకటించారు. కొన్ని నెలలుగా ఇజ్రాయల్, గాజాల మధ్య భీకరమైన యుద్దం కొనసాగుతుంది. గాజాలోని వేలాది మంది అమాయకులు తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Mar 2, 2024, 12:36 PM IST
  • గాజాకు ఆపన్నహస్తం అందించేందుకు ముందుకొచ్చిన అమెరికా..
  • అన్నం దొరక్క పశుగ్రాసం, కాక్టస్ లు తింటున్న ప్రజలు..
Israel Vs Hamas War: గొప్ప మనసు చాటుకున్న అమెరికా.. విమానం, ట్రక్కులలో ఆహారం, మందుల పంపిణి..

Israeli-Palestinian Conflict: ఇజ్రాయల్, గాజాపై పై విరుచుకుపడుతుంది. కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య యుద్దం పీక్స్ కు చేరింది. ఈ నేపథ్యంలోనే.. గాజాలో అమాయకులు కనీసం తినడానికి ఆహారం లేక అలమటిస్తున్నారు. అదే విధంగా అక్కడ బుల్లెట్లు, బంకర్ల దాడిలో గాయపడిన వారంతా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రులన్ని తీవ్రంగా గాయపడిన వారితో నిండిపోయి కిక్కిరిసిపోయింది.

Read More: Mango: సమ్మర్ లో మామిడి పండ్లను అతిగా తింటున్నారా..?... ఈ విషయాలు మీకోసమే..

అక్కడ కనీసం ఒక పూటకూడా తిండి గింజలు దొరకని, పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆహారం ట్రక్కు వద్ద ప్రజలు ఆహారంకోసం ప్రయత్నించగా ఇజ్రయల్ దళాలు వారందరిని కాల్చి చంపాయి. ఈ  ఘటనలో వందల మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో గాజా ప్రజలు తమకు ఐక్యరాజ్యసమితి ఆపన్న హస్తం అందించాలని కూడా కోరారు. ఇక అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో ప్రారంభమైన దాదాపు ఐదు నెలల యుద్ధంలో పాలస్తీనియన్లు తీవ్ర దయానీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

 కొన్నిచోట్ల కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో అనేక ప్రాంతాలలో కొందరు ఒకరిపై మరోకరు ఆహారం కోసం, దాడులుకూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే ఎందరో పసిపిల్లలు, ఆకలికి తాళలేక చనిపోయినట్లు అనేక కథనాలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా.. తాజాగా అగ్రరాజ్యం అమెరికా దీనిపై స్పందించింది. ఇజ్రాయల్, పాలస్తీనాలు యుధ్దం వెంటనే ఆపేసి, చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. అంతే కాకుండా.. తమ వంతుగా గాజాలోకి అమాయకులకు, హెలికాప్టర్లు, ట్రక్కులతో ఆహారం, మందులు, నిత్యావసరాల సరుకులు పంపిణీ చేస్తామని యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్  పేర్కొన్నారు.

ఇప్పటికే..  జోర్డాన్,  ఫ్రాన్స్‌తో సహా ఇతర దేశాలు ఇప్పటికే గాజాలోకి సహాయక చర్యలను చేపట్టాయి. అయితే.. గాజాకు మాత్రం ప్రస్తుతం అందుతున్న సహాయం ఏమాత్రం సరిపోదని, మరిన్ని దేశాలు ముందుకు రావాలని కూడా బిడెన్ కోరారు. వైట్ హౌస్ వద్ద, ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. హెలికాప్టర్ లతో నిరంతరం అన్నిరకాలుగా ఆపన్న హస్తం అందించాలని పేర్కొన్నారు.

గాజాకు పెద్ద మొత్తంలో సహాయాన్ని అందించడానికి సముద్ర కారిడార్‌ను కూడా యుఎస్ పరిశీలిస్తోందని బిడెన్ విలేకరుల  సమావేశంలో అన్నారు. యూనైటేడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ ప్రకారం, గాజా స్ట్రిప్‌లో కనీసం 576,000 మంది - ఎన్‌క్లేవ్ జనాభాలో నాలుగింట ఒక వంతు మంది కరువు నుండి ఒక అడుగు దూరంలో ఉన్నారని సమాచారం. 

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో ఈ అరాచకం ప్రారంభమైంది. దాదాపు ఐదు నెలల యుద్ధంలో పాలస్తీనియన్లు తీవ్ర దయానీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే గత గురువారం తెల్లవారుజామున గాజా నగరానికి సమీపంలో సహాయక కాన్వాయ్‌ను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న 100 మందికి పైగా అమాయకులు, ఇజ్రాయెల్ దాడులలో మరణించాయని గాజా ఆరోగ్య అధికారులు తెలిపారు. .

సహాయక ట్రక్కుల చుట్టూ గుమిగూడిన జనసమూహం వల్ల చాలా మంది మరణాలు సంభవించాయని ఇజ్రాయెల్ ఆరోపించింది. ట్రక్కు చుట్టుపక్కల ఉన్న..  బాధితులు తొక్కించబడ్డారని సమాచారం.  ఒక ఇజ్రాయెల్ అధికారి మాట్లాడుతూ..  కొందరితో ముప్పు పొంచి ఉందని భావించి సమూహాలపై కాల్పులు జరిపినట్లు చెప్పారు.

ప్రజలు తినడానికి తిండి దొరక్క పశుగ్రాసం తినడం చేస్తున్నారు. అంతే కాకుండా..  జీవించడానికి కాక్టస్‌లు కూడా తినడం,  పోషకాహార లోపం,  నిర్జలీకరణం కారణంగా ఆసుపత్రుల్లో పిల్లలు చనిపోతున్నారని సమాచారం. ఇదిలా ఉండగా..  ఒకప్పుడు ఉత్తర ఇరాక్‌పై నో-ఫ్లై జోన్‌కు నాయకత్వం వహించిన రిటైర్డ్ యుఎస్ ఎయిర్ ఫోర్స్ త్రీ-స్టార్ జనరల్ డేవిడ్ డెప్టులా, ఎయిర్‌డ్రాప్‌లు యుఎస్ మిలిటరీ సమర్థవంతంగా అమలు చేయగలవని అన్నారు.

Read More: Snake vs Mongoose: పాములు, ముంగిసను కాటు వేసిన విషం ఎక్కదంటారు... దీని వెనుక ఉన్న సీక్రెట్ ఇదే..

ఒక US అధికారి మాట్లాడుతూ, గాజాలో ఉన్నవారి బాధలపై ఎయిర్‌డ్రాప్‌లు పరిమిత ప్రభావాన్ని మాత్రమే చూపుతాయని అన్నారు. అనేక ప్రపంచ దేశాలు ముందుకు వచ్చి మరింత ఆపన్న హస్తం అందించాలన్నారు. గాజాలో పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉందని, ఏవైనా అదనపు సరఫరాలు ఉంటే కనీసం కొంత బాధను తగ్గించగలవని తెలుస్తోంది.  గాజాలోకి మరిన్ని సహాయాన్ని అనుమతించాలని ఇజ్రాయెల్‌కు కొన్ని నెలలుగా అమెరికా కోరుతుంది. కానీ  ఇజ్రాయెల్ మాత్రం దీన్ని ప్రతిఘటించినట్లు సమాచారం. ఇక.. ఎయిర్ డ్రాప్ తో సహాయం అందించడానికి నిర్ణయించుకున్నట్లు అమెరికా ప్రకటించింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News