Lost iPhone Found after 10 Years: ఆమె తన ఐఫోన్‌ని పదేళ్ల క్రితం పోగొట్టుకుంది.. ఎలా పోయింది.. ఎప్పుడు పోయిందనే విషయంలో కూడా ఆమెకు క్లారిటీ లేదు. కొద్దిరోజులకు కొత్త ఫోన్ తీసుకుని వాడటం మొదలుపెట్టింది. పాత ఐఫోన్ గురించి పూర్తిగా మరిచిపోయింది. ఆ ఐఫోన్ గురించి మరిచిపోయిన 10 ఏళ్లకు అనూహ్య రీతిలో అది ఇంట్లోని టాయిలెట్లోనే బయటపడింది. దీంతో ఆశ్చర్యపోవడం ఆ మహిళ వంతైంది. అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
మేరీల్యాండ్‌కి చెందిన బెక్కీ బెక్మాన్ అనే ఆ మహిళ 2012లో తన ఐఫోన్‌ని పోగొట్టుకుంది. ఆమె ఇంటి నుంచి బయటకు ఎక్కడికి వెళ్లలేదు. తాగి పడేసుకుందా అంటే అదీ లేదు. దీంతో తన ఐఫోన్ ఎక్కడ పోయిందనే విషయంలో ఆమెకు బిగ్ కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఆ మిస్టరీని చేధించలేక.. కొన్నాళ్లకు దాన్ని పూర్తిగా మరిచిపోయింది. కొత్త ఫోన్ కొనుక్కుని దాన్ని వాడటం మొదలుపెట్టింది.
ఈ క్రమంలో ఇటీవల బెక్కీ బెక్మాన్ ఉంటున్న ఇంట్లోని టాయిలెట్లో కొన్ని శబ్దాలు వినిపించడం మొదలైంది. ముఖ్యంగా టాయిలెట్ ఫ్లష్ నొక్కినప్పుడు ఆ శబ్దాలు ఎక్కువగా వినిపించేవి. బహుశా టాయిలెట్ పాతదైపోవడం.. లేదా పైపుల్లో ఏదైనా సమస్య కారణంగా ఆ శబ్దాలు వస్తున్నాయేమోనని భావించారు. ఒకానొక రోజు బెక్కీ భర్త.. టాయిలెట్ ప్లంజర్‌తో టాయిలెట్ లోపల అటు, ఇటు కదిపాడు. అంతే.. పదేళ్ల క్రితం అతని భార్య పోగొట్టుకున్న ఐఫోన్ బయటపడింది. వెంటనే దాన్ని తీసుకుని భార్య వద్దకు పరిగెత్తుకొచ్చాడు.
అప్పుడెప్పుడో పోగొట్టుకున్న ఫోన్ అనూహ్యంగా ఇంట్లోనే దొరికేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. అయితే అది వాటర్ ప్రూఫ్ కాకపోవడంతో దాని బేసిక్ స్ట్రక్చర్ మినహా అంతా డ్యామేజ్ అయింది. యూఎస్ మీడియా ద్వారా ఈ కథనం వెలుగులోకి వచ్చింది. అయితే పలువురు నెటిజన్లు దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫోన్ పదేళ్ల క్రితం టాయిలెట్లో పడిందా లేక ఇటీవలే అందులో చిక్కుకుపోయిందా అని ప్రశ్నిస్తున్నారు.
Also Read: Smartphones scheme: రైతులకు గుడ్ న్యూస్- స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.6000 సాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook