Viral video: హైవేపై బెడిసికొట్టిన బైకర్ స్టంట్.. చూస్తుండగానే గాల్లోకి ఎగిరి...

రోడ్డు మీడ వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాల జరగటం ఖాయం. కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్న అనుకోకుండా ప్రమాదాలు (Road accidents) జరగుతుంటాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2021, 05:59 PM IST
  • హైవేపై బెడిసికొట్టిన బైకర్ స్టంట్​
  • గాళ్లోకి ఎగిరిన పడిన బైకర్​, బైక్
  • నెట్టింట వైరల్​ అవుతున్న వీడియో
Viral video: హైవేపై బెడిసికొట్టిన బైకర్ స్టంట్.. చూస్తుండగానే గాల్లోకి ఎగిరి...

Bike stunt fail viral video: రోడ్డు మీడ వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదాల జరగటం ఖాయం. కొన్ని సార్లు ఎంత జాగ్రత్తగా ఉన్న అనుకోకుండా ప్రమాదాలు (Road accidents) జరగుతుంటాయి.

అలాంటిది కొంత మంది మాత్రం కోరి ప్రమాదాలను తెచ్చుకుంటుంటారు. ముఖ్యంగా బైక్​లతో స్టంట్స్ వేయబోయి (Bike stunt failures) ప్రమాదాల బారిన పడిన వారికి లెక్కే లేదు.

ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలు జరిగినా కొంత మందిలో మార్పు రావడం లేదు. ఇలాంటి ఘటనకు సంబంధించి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో (Bike Stunt Viral video) వైరల్ అవుతోంది. ఐపీస్ అధికారిణి రుపిన్ శర్మా ఈ వీడియోను అమె ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

Also read: Hardship of Life: ప్రపంచం కంట కన్నీరు పెట్టిస్తున్న ఫోటో.. గుండె బరువెక్కించే సన్నివేశం

Also read: US: తొలి 'ఎక్స్‌'’ జెండర్‌ పాస్‌పోర్టు జారీ చేసిన అగ్రదేశం

వీడియోలో ఏముందంటే..

రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఓ బైకర్ ఉన్నట్టుండి.. బైక్​తో స్టంట్లు వేయడం ప్రారంభించాడు. ముందు చక్రాన్ని గాల్లోకి లేపి బైక్​ను ముందుకు పోనివ్వ సాగాడు. కొద్ది క్షణాల్లోనే బైక్​పై నియంత్రణ కోల్కోయాడు ఆ బైకర్​. దీనితో అటుగా వస్తున్న ఓ ట్యాంకర్​ను డీ కొట్టాడు. ఈ ప్రమాదంంలో బైకర్​ దూరంగా ఎగిరి పడ్డాడు. బైక్ కూడా దూరంగా ఎగిరి పడింది.

బైకర్​ వెళ్తున్న మార్గంలోనే ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన కారులోంచి ఈ స్టంట్​ను తన కెమెరాలో బంధించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్​ చేయగా ఇప్పుడది వైరల్​గా మారింది.
అయితే ఈ వీడియో మన దేశానికి సంబంధించినది కాదు. విదేశాల్లో జరిగింది. సరిగ్గా ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? ప్రమాదంలో ఆ యువకుడికి ఏమైంది? అనే వివరాలు కూడా తెలియరాలేదు.

ఈ వీడియోను షేర్ చేసిన ఐపీఎస్​ అధికారిణి రుపిన్ శర్మ.. ఇలాంటి స్టంట్లు ఎవరూ చేయోద్దంటూ ట్విట్టర్​ ద్వారా సూచించారు. సినిమాల్లో హీరోల్లో స్టంట్లు వేయోద్దంటూ సలహా ఇచ్చారు.

Also read: China Taiwan: తైవాన్‌ కచ్చితంగా చైనాలో కలవాల్సిందే ‌‌- చైనా స్టేట్ కౌన్సిలర్ వాంగ్ యీ

Also read: Vaccine For Kids: చిన్నారుల కరోనా టీకాకు అమెరికా ఎఫ్​డీఏ ఆమోదం- 5-11 ఏళ్ల వారికి ఇచ్చేందుకు కసరత్తు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News