Delta Variant: డెల్టా వేరియంట్ చాలా డేంజరస్..ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

Delta Variant: ఇండియాను వణికించిన కరోనా సెకండ్ వేవ్‌కు కారణమైన వైరస్ డెల్టా వేరియంట్. ఇప్పుడీ వేరియంట్ ప్రపంచ దేశాల్ని భయపెడుతోంది. ఇది చాలా ప్రమాదకరమని..మరణ మృదంగం మోగవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 27, 2021, 02:58 PM IST
Delta Variant: డెల్టా వేరియంట్ చాలా డేంజరస్..ప్రపంచదేశాలకు డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

Delta Variant: ఇండియాను వణికించిన కరోనా సెకండ్ వేవ్‌కు కారణమైన వైరస్ డెల్టా వేరియంట్. ఇప్పుడీ వేరియంట్ ప్రపంచ దేశాల్ని భయపెడుతోంది. ఇది చాలా ప్రమాదకరమని..మరణ మృదంగం మోగవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి డెల్టా వేరియంట్ (Delta Variant) వైరస్ ప్రధాన కారణమని ఇప్పటికే గుర్తించిన పరిస్థితి. ఇప్పుడీ వైరస్..ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ ప్రపంచంలోని 85 దేశాల్లో వ్యాపించడమే దీనికి కారణం. కరోనా వైరస్‌కు సంబంధించి ఇప్పటి వరకూ గుర్తించిన వేరియంట్ల కంటే ఇది చాలా ఎక్కువగా వ్యాప్తి చెందగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ టెడ్రోస్ అథనామ్ హెచ్చరించారు. మరీ ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకోనివారిలో ఈ వ్యాధి సంక్రమణ చాలా తీవ్రంగా ఉంది. చాలా ప్రాంతాల్లో కరోనా ఆంక్షల్లో సడలింపుల కారణంగా సంక్రమణ మరింతగా పెరుగుతోందని..పరిస్థితి ఇలాగే కొనసాగితే మరణమృదంగం మోగుతుందని హెచ్చరిస్తున్నారు.

భవిష్యత్‌లో మరిన్ని వైరస్ వేరియంట్లు వచ్చే అవకాశాలున్నాయని..కేవలం సంక్రమణ ఛైన్‌ను అరికట్టడం ద్వారా మాత్రమే కొత్త వేరియంట్ల పుట్టుకను అడ్డుకోవచ్చని టెడ్రోస్ అథనామ్ తెలిపారు. ఆల్ఫా వైరస్‌తో పోలిస్తే..డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు హెచ్చరించారు. డెల్టా వేరియంట్ సహా అన్ని రకాల వేరియంట్లను సమర్ధవంతంగా అడ్డుకోవడంలో వ్యాక్సిన్లు సమర్ధవంతంగా ప్రభావవంతంగా పనిచేస్తాయని డబ్ల్యూహెచ్‌వో(WHO)చెబుతోంది. కొన్ని దేశాల్లో ఇంకా వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియ పూర్తి కాలేదని గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో డెల్టా వేరియంట్ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 

Also read: Delta Variant Threat: ఆ దేశాల్ని టార్గెట్ చేసిన డెల్టా వేరియంట్, మరోసారి ఆంక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News