Delta Virus: కబళిస్తున్న కరోనా.. ఒకేరోజు 10 వేలమందిని బలిగొన్న మహమ్మారి

తగ్గుతున్నట్టే కనపడుతున్న కరోనా వైరస్ మళ్లీ ప్రపంచ దేశాలపై విజృంభిస్తుంది. అమెరికా,  బ్రిటన్, ఇరాన్, ఆస్ట్రేలియా లాంటి అన్ని దేశాల్లో కరోనా వైరస్ అధికమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒకే రోజులో 10వేల మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎంత కఠినంగా మారిందో తెలుస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 14, 2021, 02:17 PM IST
  • ప్రపంచదేశాల్లో విజృంభిస్తున్న కరోనా వైరస్
  • ఒక్కరోజే 10వేల మందిని బలిగొన్న కరోనా వైరస్
  • అగ్రరాజ్యంలో ఒక్క రోజులో 660 మంది మరణం
Delta Virus: కబళిస్తున్న కరోనా.. ఒకేరోజు 10 వేలమందిని బలిగొన్న మహమ్మారి

"కరోనా వైరస్" పేరు వింటేనే అగ్రరాజ్యలే కాదు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దాదాపు రెండు సంవత్సరాలుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు ఎన్నో లక్షాల కుటుంబాల్లో శోకాన్ని నింపుతుంది. 
కాస్త తగ్గినట్టుగా అనిపించిన మహమ్మారి మళ్లీ కోరలు చాచి వేలాది మందిని బలిగొంటుంది. గడచిన 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 7 లక్షలకు పైగా కేసులు నమోదు అవ్వటం, 10వేల మంది మరణించారంటే మనిషి మనుగడకు ఎంత ప్రమాదకరంగా మారిదో అర్థమవుతుంది. 

Also Read: భయం గుప్పిట్లో బెంగళూరు, చిన్నారుల్ని టార్గెట్ చేస్తున్న కరోనా మహమ్మారి
ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో (America) అత్యధికంగా 1.43లక్షల కేసులు నమోదు కాగా, 660 మంది మరణిచారు. డెల్టా వైరస్ (Delta Virus) వ్యాప్తి అధికంగా ఉన్నందున అవయవ మార్పిడి జరిగిన వారికి, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి బూస్టర్ డోసులను ఇవ్వాలని "అమెరిక ఆరోగ్య నియంత్రణ సంస్థ" (FDA) కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఉన్న వారి సంఖ్య 3 శాతంగా ఉండగా, ఈ అదనపు డోసులు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండదని అమెరికా ఆరోగ్య సంస్థ తెలిపింది. 
డెల్టా వేరియంట్ (Delta Variant) తో సతమతం అవుతున్న బ్రిటన్ (Britain), ఇరాన్ (Iran) పరిస్థితి చూస్తే వైరస్ వ్యాప్తి ఆందోళన కరంగా మారింది. బ్రిటన్ విషయానికి వస్తే ఒకే రోజులో డెల్టా వేరియంట్ వలన 33,074 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రిటన్ లో 60 శాతం జనాభాకు కరోనా వ్యాక్సినేషన్ (Corona vaccine) పూర్తి అయినట్టు, మిగతా వారికి కూడా వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది.  

Also Read: కాక్‌టైల్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మంచిది కాదంటున్న సీరమ్ ఛైర్మన్ సైరస్ పూనావాలా

ఇదిలా ఉండగా ఇరాన్ (Iran) లో పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉందని చెప్పవచ్చు, ఎందుకంటే ఒక్క రోజులోనే ఇరాన్ లో 39 వేల పాజిటివ్ కేసులు (Positive cases) నమోదవ్వటంతో పాటూ, 568మంది కరోనా భారినపడి ప్రాణాలు కోల్పోవటం విషాదానికి గురి చేస్తుంది.
ఇక ఇతర దేశాల విషయానికి వస్తే, ఆస్ట్రేలియాలో (Australia) అధికంగా జన సాంద్రత ఉండే న్యూసౌత్‌వేల్స్‌లో (New South Wales) ఒక్క రోజే 390 కేసులు నమోదవ్వటం అక్కడ అధికారులలో భయాందోళనలకు గురి చేస్తుంది. ఇటు సిడ్నీ (Sydney) లో జూన్ 26 నుండి లాక్ డౌన్ (Lock down) కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే.
ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఒకవేళ కరోనా నిబంధలను, జాగ్రత్తలను పాటించకపొతే, మరోసారి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ దేశాలకు,  ప్రజలకు "ప్రపంచ ఆరోగ్య సంస్థ"( WHO)  హెచ్చరిస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News