ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం..

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనులకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో మిరప కోత కూలీలతో వెళుతున్న ట్రాక్టర్‌ అదుపు తప్పి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొన్న దుర్ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కాగా తొమ్మిదిమంది

Last Updated : May 15, 2020, 12:25 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం..

అమరావతి: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ పనులకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో మిరప కోత కూలీలతో వెళుతున్న ట్రాక్టర్‌ అదుపు తప్పి కరెంట్‌ స్తంభాన్ని ఢీకొన్న దుర్ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కాగా తొమ్మిదిమంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కూలీ పని ముగించుకొని కూలీలతో బయల్దేరిన ట్రాక్టర్‌ అతి వేగంగా రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్థంభాన్ని ఢీకొట్టడంతో స్తంభం ట్రాక్టర్ మీద పడడంతో అధిక విద్యుత్ ప్రవాహం గల వైర్లు వాహనం మీద పడ్డాయి. 

ఈ ట్రాక్టర్‌లో డ్రైవర్‌తో కలిపి 23మంది ఉన్నారని, మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ట్రాక్టరు ప్రమాదం, కూలీలు మరణించిన ఘటనపై సీఎం వైయస్‌.జగన్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News