AP Schools: విద్యార్థుల హాజరు శాతంపై మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన

Schools reopened in AP: అమరావతి : కరోనావైరస్ వ్యాప్తి నివారణ కోసం లాక్ డౌన్ విధించిన కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడగా ఇటీవల కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలు పాటిస్తూ ఈనెల 2వ తేదీన ఏపీలోని పాఠశాలలు తెరుచుకున్న సంగతి తెలిసిందే.

Last Updated : Nov 4, 2020, 07:34 PM IST
AP Schools: విద్యార్థుల హాజరు శాతంపై మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన

Schools reopened in AP: అమరావతి : కరోనావైరస్ వ్యాప్తి నివారణ కోసం లాక్ డౌన్ విధించిన కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతపడగా ఇటీవల కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలు పాటిస్తూ ఈనెల 2వ తేదీన ఏపీలోని పాఠశాలలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. 2వ తేదీన పాఠశాలలు తెరవగా 4వ తేదీ బుధవారం నాటికి ఒక్క కృష్ణా జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 100 శాతం ఉన్నత పాఠశాలలు తెరుచుకున్నాయి. 1, 11, 177 మంది ఉపాధ్యాయులకు 99, 062 మంది పాఠశాలలకు హాజరయ్యారు. మొత్తంగా ఉపాధ్యాయుల హాజరు శాతం 89.10 కి చేరింది. అలాగే విద్యార్థులు సైతం పాఠశాలలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ( AP minister Adimulapu Suresh ) తెలిపారు.

Also read : AP: ఏపీలో భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు

మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించిన వివరాల ప్రకారం 2వ తేదీన 42 శాతం విద్యార్థులు, 3న 33.69 శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరవ్వగా 4వ తేదీన 40.30 శాతం విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. కొన్ని జిల్లాల్లో గతంలోనే కరోనా వైరస్ ( Coronavirus ) సోకిన వారికి తాజాగా పాఠశాలల్లో పరీక్షలు చేసినప్పుడు బయటపడుతున్నాయి. కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొవిడ్-19 టెస్ట్‌లు చేస్తున్నారు. 

కోవిడ్‌పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్‌లు ధరించేలా ( Sanitization, masks ) జాగ్రత్తలు తీసుకుంటున్నాం. విద్యార్థుల ఆరోగ్యమే ప్రధాన ద్యేయంగా అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం. పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని... అలాగే మాస్క్, శానిటైజేషన్, సామజిక దూరం ( Social distancing ) విషయాల్లో రాజీ పడవద్దని అధికారులకు కచ్చితమైన ఆదేశాలు ఇవ్వటం జరిగిందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

Also read : AP Board of Intermediate: విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News