ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అజయ్ కల్లం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో మొదటి బ్లాక్‌లో తనకు కేటాయించిన చాంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అజేయ కల్లంకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం శుభాకాంక్షలు తెలిపారు.  

Last Updated : Jun 5, 2019, 06:26 PM IST
ముఖ్య సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన అజయ్ కల్లం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ముఖ్య సలహాదారుగా మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో మొదటి బ్లాక్‌లో తనకు కేటాయించిన చాంబర్‌లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అజయ్ కల్లంకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం శుభాకాంక్షలు తెలిపారు.  

ముఖ్యమంత్రి కార్యాలయానికి అజయ్ కల్లం అధిపతిగా వ్యవహరించనున్నారు. ప్రభుత్వ సలహాదారులందరూ అజయ్ కల్లంకు జవాబుదారీగా ఉండేలా ఆయన నియామకం జరిగినట్టు తెలుస్తోంది. కేబినెట్‌ మంత్రి హోదా కలిగిన ఈ పదవిలో ఆయన మూడు సంవత్సరాలు కొనసాగనున్నారు. టీఏ, డీఏ, ఇతర సౌకర్యాలు కలుపుకుని నెలకు రూ.2.50 లక్షలు వేతనం అందించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Trending News