Allu Arjun photos in ys jagan birthday celebrations flexy goes viral: అల్లు అర్జున్ పుష్ప2 మూవీ ఇటీవల ప్రపంచంలో ఒక రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోతుంది. అయితే.. ఈ మూవీ ప్రస్తుతం వివాదాల పరంగా కూడా అంతే వార్తలలో ఉంటుంది. ముఖ్యంగా అశోక్ నగర్ లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ లో వెంటిలెటర్ మీద చికిత్స తీసుకుంటున్నాడు.
అయితే.. ఇటీవల పోలీసులు.. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. దీంతో మెగా ఫ్యామిలీ, అల్లు అరవింద్ ను కలిశారు. అదే విధంగా కోర్టు మధ్యంతర బెయిల్ మీద విడుదలయ్యాక.. చిరంజీవి, నాగబాబు, పలువురు మెగా ఫ్యామిలీ నుంచి బన్నీని వెళ్లి కలిశారు. బన్నీ కూడా.. మరల చిరంజీవి ఇంటికి వెళ్లి కలిసినట్లు తెలుస్తొంది.
దీంతో మెగా , అల్లు ఫ్యామిలీలు కలిసి పోయారని కూడా అందరు ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే.. ప్రస్తుతం మరల మాజీ సీఎం వైఎస్ జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఈ రోజు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో జగన్ ఫోటోతో పాటు అల్లు అర్జున్ ఫోటో ను ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. అంతేగాదు ఈ ఫ్లెక్సీపై ఒక కొటేషన్ ను కూడా పెట్టారు. రాజు బలవంతుడైనప్పుడే శత్రువులు అందరు ఏకం అవుతారంటూ కొటేషన్ వేయగా ఇది వైరల్‌గా మారింది. దీంతో ప్రస్తుతం ఇది మరల వివాదానికి కారణమౌతుందని కొంత మంది నెటిజన్లు అంటున్నారు.
గతంలో నంద్యాలలో ఎన్నికల ప్రచారంలోకి వెళ్లినప్పుడు... వీరి మధ్య ట్విటర్ వేదికగా వార్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఏపీలో కూటమికి.. వైసీపీకి తగ్గాఫార్ వార్ నడుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం మరల జగన్ బర్త్ డే ఫ్లెక్సీలపై అల్లు అర్జున్ ఫోటోలు ఉండటం కూడా చర్చకు దారితీసింది.
Read more: Tirumala news: ఏంతమాషాగా ఉందా..?.. మాజీ మంత్రి వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ సీరియస్... కేసు నమోదు..?
అంతే కాకుండా.. రాజు బలవంతుడైతే.. అంటే.. ఇక్కడ జగన్ లేదా బన్నీ లు బలవంతులు.. కూటమి, కాంగ్రెస్, మెగా ఫ్యామిలీ ఒక్కటై.. వీరిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఇన్ డైరెక్ట్ గా ఈ కొటేషన్ పెట్టారా.. అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారంట. మొత్తానికి ఈ ఫ్లెక్సీతో మరల మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ గొడవ మరోసారి తెరమీదకు వచ్చినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.