YS Sharmila: మూడు నామాల వానికే మోదీ పంగనామాలు .. తిరుపతి సభలో ఘాటు వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల..

Andhra Pradesh: దేశ ప్రధాని మోదీ తల్లిలాంటి ఆంధ్ర ప్రదేశ్‌ ను చంపేశారని, మోడీ అంటే మోసం. మోసం చేసే వాడే మోడీ అంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ తొలి సంతకం ఉంటుందని తిరుపతి వేదికగా వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Mar 1, 2024, 09:09 PM IST
  • ఉద్యోగాలు పేరు చెప్పి యువతను మోసం చేశారు..
  • జగన్,బీజేపీ,బాబు రాష్ట్రాన్ని మోసం చేసే వాళ్ళన్న వైఎస్ షర్మిలా
YS Sharmila: మూడు నామాల వానికే మోదీ పంగనామాలు .. తిరుపతి సభలో ఘాటు వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల..

APCC Sharmila Fires On PM MOdi In Tirupati Public Meeting: "ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు అని.. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా అన్నారు. ప్రధాని మోదీ.. మూడు నామాల వానికే మోడీ పంగనామాలు పెట్టాడంటూ ఘాటువ్యాఖ్యలు చేశారు. తిరుపతి తారక రామ గ్రౌండ్ లో  APCC ప్రత్యేక హోదా సాధన సభ నేపథ్యంలో వైఎస్ షర్మిలా మాట్లాడారు. ఈక్రమంలోనే దేశ ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని మోడీ చంపారు.. పోలవరం కట్టకుండా రాష్ట్రాన్ని చంపుతుంది మోడీ నే అని షర్మిలా ఎద్దేవా చేశారు

Read More: Sara Ali Khan: హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్ల మదిని దోచేస్తున్న సారా, ట్రెండింగ్ లో పిక్స్

కోమాలో ఉన్న కాంగ్రెస్ లో నేను చేరింది కేవలం విభజన హామీల సాధన కోసమేనని క్లారిటీ ఇచ్చారు. హోదాకోసం అరాట పడే వాళ్ళ మద్య..హోదాను తాకట్టు పెట్టే వారికి మధ్య జరుగుతున్న పోరాటమని అన్నారు. కాంగ్రెస్ కు పట్టం కడితే.. ప్రత్యేక హోదా తో పాటు వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రతి గడపకు తీసుకువస్తానని  వైఎస్ షర్మిలా రెడ్డి పేర్కొన్నారు. 

తిరుపతిలో 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ ఇచ్చిన హమీలను వైఎస్ షర్మిలా ప్రజలకు గుర్తు చేశారు. ఆ సభలో ఎన్నో మాటలు చెప్పాడని, అవేవి నెరవేర్చలేని షర్మిల అన్నారు.  ఆంధ్ర ప్రజల అవేదన నాకు తెలుసని, కల్లి బొల్లి మాటలతో నమ్మించి మోసం చేశాడని పీఎం మోదీపై షర్మిలా విరుచుకుపడ్డారు.  అధికారం వచ్చిన వెంటనే 10 ఏళ్లు హోదా ఇస్తా అని చెప్పి, ఆంధ్ర రూపు రూపు రేఖలు మారుస్తానని చెప్పి ఏమి చేయలేదన్నాడు.  

న్యూ ఢిల్లీ చిన్నబోయే విధంగా..  రాజధాని సహకారం అందిస్తానని చెప్పి, ఆంధ్రలో హర్డ్ వేర్ హబ్, ఇంధన యూనివర్సిటీ ఎన్నేన్నో మాటలు చెప్పాడని ఆమె వైఎస్ షర్మిలా విమర్శించారు. మోదీ ప్రచారంలో.. ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేక పోయారని, ఢిల్లీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా పొందటం మన హక్కు అని షర్మిలా ప్రజలకు తెలిపారు. ఇది  కాంగ్రెస్ ప్రభుత్వం ఏపి విభజన చట్టంలో పెట్టిందని, విభజన హామీలు పొందటం మన హక్కుఅని, పోలవరం కూడా జాతీయ హోదా కల్పించుకుని తీరుతామని ఆమె అన్నారు. 

కడప స్టీల్, దుగ్గరాజ పట్నం పోర్ట్,  ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ,ఇవన్ని పొందటం మన హక్కు అని వైఎస్ షర్మిలా అన్నారు.  మన హక్కులు మనకు లభిస్తున్నాయా ? లేదా ? ..  రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు.  హక్కుల సాధనలో బాబు,జగన్ విఫలమయ్యారని, వీరిద్దరు కూడా..  ఒక్క హక్కు మీద కూడా పోరాటం చేయలేదుకదా, కనీసం నిలబడలేదు కూడా అని ఎద్దేవాచేశారు.  విభజన జరిగి 10 ఏళ్లు దాటినా కూడా..  ఒక్క హామీ సాధించుకొలేకపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.హోదా సాధనలో బాబు,జగన్ మాట మార్చారని, 15 ఏళ్లు హోదా కావాలని బాబు అడిగితే, ఆ తర్వాత హోదా అడిగితే జైల్లో పెట్టారు. పీఎం మోదీ.. ఊసరవెల్లి లా రంగులు మార్చారు.. ఈయన రంగులు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని షర్మిల అన్నారు.

జగన్ అన్న 25ఎంపీలు కావాలని అడిగారు..  హోదా కోసం దీక్షలు చేశారు. ఎంపీలు రాజీనామా చేస్తే హోదా ఎందుకు రాదో చూద్దాం అన్నాడు.. కేంద్రంపై పంజా విప్పుధం అన్నాడు.. పులిలా గర్జించి అధికారం రాగానే పిల్లి అయ్యాడని జగన్ ను విమర్శించారు. బీజేపీ కి జగన్ అన్న బానిస అయ్యాడని, మోదీకి వంగి వంగి దండాలు పెడుతున్నాడు.  కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రం మనదని ఆమె అన్నారు.

ఎవరికైన మన రాజధాని ఏది అంటే ఏం చెప్తాం..?.. ఒక ముఖ్యమంత్రి 3D గ్రాఫిక్స్ చూపించారు.. ఒక ముఖ్యమంత్రి 3 రాజధానులు అన్నాడు..  10 ఏళ్లలో ఏపికి ఏ రాజధాని లేదని చంద్రబాబు, జగనన్నని కలిపి ఆరేశారు.  హోదా కోసం రాష్ట్రంలో యువత హత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇదే గ్రౌండ్ లో ముని కోటి అనే యువకుడు పెట్రోల్ పోసుకొని చనిపోయాడని గుర్తు చేశారు. ఈ పాపం బీజేపీది,బాబుది,జగన్ దని షర్మిలా అన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి.  మోసం చేసిన బీజేపీతో మళ్ళీ పొత్తులకు సిద్ధం అవుతున్నారు.  

Read more: Mango: సమ్మర్ లో మామిడి పండ్లను అతిగా తింటున్నారా..?... ఈ విషయాలు మీకోసమే..

రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్న వీళ్ళు మనకు అవసరమా ?.. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం మోడీ దగ్గర తాకట్టు పెట్టారు..ఈ రెండు పార్టీలు మోదీకి ఊడిగం చేస్తున్నాయని షర్మిలా ఘాటు వ్యాఖ్యలుచేశారు. -ఉద్యోగాల పేరు చెప్పి యువతను మోసం చేశారని,  రేవు దాటెంత వరకే ఓడ మల్లన్న... తెప్ప దాటాక బోడి మల్లన్న అన్నట్లు.. జగన్, బాబు ఇద్దరు బోడి మల్లన్నలంటూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News