YCP Election Campaign: ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 లక్ష్యంతో ఒంటరిగా బరిలో దిగుతుంటే..ప్రతిపక్షాలు తెలుగుదేశం-జనసేన-బీజేపీలు కూటమిగా బరిలో దిగుతున్నాయి. ఈ నెల 17 వతేదీన మూడు పార్టీలు ప్రధాని మోదీతో ఉమ్మడి సభకు ఏర్పాట్లు చేస్తుంటే..అటు వైఎస్ జగన్ ఈ నెల 16 ముహూర్తం సెట్ చేశారు. అస్త్రాల్ని సిద్ధం చేసుకుని యుద్ధానికి సిద్ధమంటున్నారు.
మరోసారి అధికారం కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని అస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 90 అసెంబ్లీ నియోజకవర్గాలు, పలు లోక్‌సభ స్థానాల్లో అభ్యర్ధుల్ని మార్చేశారు. కొందరికి నో టికెట్ అన్నారు. విజయమే లక్ష్యంగా అభ్యర్ధుల ఎంపికలో తనవారికిన కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు తుది జాబితా విడుదలకు ముహూర్తం సెట్ అయింది. ఇడుపులపాయలో ఈ నెల 16వ తేదీన అభ్యర్ధుల తుది జాబితా విడుదల చేయనున్నారు. మరోవైపు ఈసారి ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ కానున్న అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోకు రూపకల్పన చేశారు.
వృద్ధాప్య పెన్షన్లు 3 వేల నుంచి 4 వేలకు పెంచడం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతుల రుణమాఫీ వంటి కీలకమైన అంశాలు మేనిఫెస్టోలో ఉన్నట్టు తెలుస్తోంది. మేదరమెట్లలో జరిగిన 4వ సిద్ధం సభలో కూడా త్వరలో మేనిఫెస్టో విడుదల చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ నెల 16వ తేదీని మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. అభ్యర్దుల తుది జాబితా విడుదల, మేనిఫెస్టో ప్రకటన తరువాత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.
ఈ నెల 16వ తేదీన ఇడుపులపాయ నుంచి నేరుగా శ్రీకాకుళం జిల్లా ఇఛ్చాపురం చేరుకుంటారు. గతంలో పాదయాత్ర ముగించిన ప్రాంతం నుంచి ఈసారి ప్రచారం ప్రారంభించనున్నారు. మరో రెండ్రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్నందున ఆ తరువాతే షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.
Also read: AP High Court: గ్రూప్ 1 పరీక్షల్ని రద్దు చేసిన ఏపీ హైకోర్టు, అప్పీల్‌కు వెళ్తామంటున్న ప్రభుత్వం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook