AP Cabinet Meeting Decisions: విజయదశమి నుంచే విశాఖలో పాలన మొదలు.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే..!

AP Cabinet Meeting Highlights: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. జీపీఎస్ బిల్లుకు ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రిటైర్ అయిన పిల్లలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని నిర్ణయించింది. కేబినెట్‌ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 20, 2023, 02:53 PM IST
AP Cabinet Meeting Decisions: విజయదశమి నుంచే విశాఖలో పాలన మొదలు.. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే..!

AP Cabinet Meeting Highlights: సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయదశమి నుంచే విశాఖపట్నం నుంచి పాలన మొదలు పెట్టేందుకు ఆమోదం తెలిపారు. అప్పటివరకూ కార్యాలయాలను తరలించాలని నిర్ణయించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు చేయనున్నారు. ముందస్తు, జమిలి ఎన్నికలపై కేంద్రం నిర్ణయం ప్రకారమే ముందుకు వెళ్లేందుకు మంత్రి మండలి అంగీకరించింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్‌ బిల్లు అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఉద్యోగి రిటైర్డ్‌ అయిన సమయానికి ఇంటి స్థలం లేని వారికి కచ్చితంగా ఇంటి స్థలం ఉండాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రిటైర్డ్‌ అయిన తర్వాత ఉద్యోగులు వారి పిల్లలకు ఆరోగ్యశ్రీ కింద కవర్‌ అయ్యేలా చూడాలని కేబినెట్ తెలిపింది. కేబినెట్‌ భేటీలో 49 అంశాలపై చర్చ జరిగింది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో మరో పథకం ఏర్పాటుకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లు, ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు, ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లులకు కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.

ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్‌ ఉండేలా చట్ట సవరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వాలని పేర్కొంది. ప్రైవేటు యూనివర్శిటీల్లో కూడా నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మార్పుల వల్ల పిల్లలకు మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

కురుపం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు, పీఓటీ చట్ట సవరణకు, భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లు, దేవాదాయ చట్ట సవరణ బిల్లులకు మంత్రి మండలి అంగీకరించింది.

Also Read: Bigg Boss Season 7 Telugu: ఛీఛీ రతిక కూడానా.. ప్రిన్స్ యావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బ్యూటీ   

Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News