Ap Cabinet: ఇవాళ జరగనున్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ అత్యంత కీలకమైంది. మిచౌంగ్ తుపానుతో పంటనష్టం, పరిహారంతో పాటు పెన్షన్ పెంపు ఇతర సంక్షేమ పధకాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపు జరగనుంది.
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇవాళ జరిగే కేబినెట్ భేటీ అందుకే కీలకం కానుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ జనవరి 2024 నుంచి 3 వేల రూపాయలు కానుంది. ఈ క్రమంలో ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో పింఛన్ పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకూ ప్రతి నెలా 65.33 లక్షలమందికి 18 వందల కోట్ల పింఛన్లకు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. జనవరి 2024 నుంచి అదనంగా మరో 2 వందల కోట్లు కేటాయించాల్సి వస్తుంది.
మరోవైపు మిచౌంగ్ తుపానుతో జరిగిన నష్టంపై అంచనా వేసి పరిహారం ప్రకటించనున్నారు. ఉచిత ఇళ్లు, ఇంటి పట్టాల విషయంలో కూడా మంత్రిమండలిలో చర్చించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పధకాలకు వచ్చే ఏడాది జనవరిలో కేటాయించాల్సిన నిధులపై చర్చించనున్నారు. పలు సంక్షేమ పధకాల అమలుపై కేబినెట్ ఆమోదం తెలుపనుంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంపకాల విషయంలో కేబినెట్ చర్చించనుంది.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగ ఖాళీల్ని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తోంది. ఇప్పుడు మరోసారి గ్రూప్ 1, 2 నోటిఫికేషన్ విడుదల చేసే విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో ఇవాళ జరిగే కేబినెట్ భేటీలో ఇంకా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.
Also read: Ap Inter Exams 2024: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల పూర్తి షెడ్యూల్, ఏ పరీక్ష ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook