ఆన్‌లైన్ లోన్ యాప్స్, ఆన్‌లైన్ లోన్ ఫెసిలిటేటర్స్ వేధింపులు, వ్యవహారాలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఆన్‌లైన్ కాల్ మనీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆన్‌లైన్ లోన్ల ( Online loans ) వ్యవహారం ఇటీవలి కాలంగా చాలా ఎక్కువైంది. కరోనా వైరస్, లాక్‌డౌన్ నేపధ్యంలో డబ్బులు అవసరమై చాలామంది ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో ( Instant loan apps ) ఇరుక్కుంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఇద్దరు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని అటు తెలంగాణ ( Telangana ), ఇటు ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకున్నాయి. సైబరాబాద్‌లో ఇప్పటికే కేసులు నమోదు చేయడమే కాకుండా 11 మందిని అరెస్టు చేశారు. మరోవైపు ఆర్బీఐకు సమాచారమందించారు.
ఇటు ఇదే వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) స్పందించారు. ఆన్‌లైన్ కాల్ మనీ కేసులపై దృష్టి పెట్టాలని, వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసేవారిని ఉపేక్షించేది లేదన్నారు. మొబైల్ లోన్ యాప్స్‌పై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ ( DGP Gautam Sawang ) తెలిపారు. మైక్రో ఫైనాన్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. మొబైల్ లోన్ యాప్‌లు ఎక్కువగా మహిళల్ని టార్గెట్ చేస్తున్నాయని డీజీపీ తెలిపారు.
AP: ఆన్‌లైన్ లోన్ యాప్స్, వేధింపులపై కఠిన చర్యలిక