Ys jagan on Chiru Tweet: మెగాస్టార్ చిరంజీవికు..వైఎస్ జగన్ కృతజ్ఞతలు

Ys jagan on Chiru Tweet: ఏపీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రశంసించి చిరంజీవి ట్వీట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. మెగాస్టార్ చిరంజీవికు ప్రభుత్వం తరపున జగన్ కృజ్ఞతలు తెలిపారు. వ్యాక్సిన్ సక్సెస్ వెనుక ప్రభుత్వ యంత్రాంగం కృషి ఉందని వివరించారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 23, 2021, 05:34 PM IST
 Ys jagan on Chiru Tweet: మెగాస్టార్ చిరంజీవికు..వైఎస్ జగన్ కృతజ్ఞతలు

Ys jagan on Chiru Tweet: ఏపీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రశంసించి చిరంజీవి ట్వీట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. మెగాస్టార్ చిరంజీవికు ప్రభుత్వం తరపున జగన్ కృజ్ఞతలు తెలిపారు. వ్యాక్సిన్ సక్సెస్ వెనుక ప్రభుత్వ యంత్రాంగం కృషి ఉందని వివరించారు.

ఏపీలో వ్యాక్సినేషన్ (Ap Vaccination Program)కార్యక్రమం రికార్డు స్థాయిలో జరిగింది. మెగా వ్యాక్సిన్ డ్రైవ్ పేరుతో ఒక్కరోజులోనే 13 లక్షల 72 వేలమందికి వ్యాక్సిన్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రశంసించడమే కాకుండా..వైఎస్ జగన్ నాయకత్వాన్ని కొనియాడుతూ ట్వీట్ చేశారు.చిరంజీవి ట్వీట్‌పై ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఏపీ ప్రభుత్వం (Ap government) తరపున చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడం వెనుక ప్రభుత్వ యంత్రాంగం కృషి చాలా ఉందని వైఎస్ జగన్ చిరంజీవికు ట్వీట్ ద్వారా తెలిపారు.

గ్రామ వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, వైద్యులు, మండల, జిల్లా అధికారులు, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు అందరి సహకారంతో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతమైందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం మెగా వ్యాక్సిన్ డ్రైవ్ (Mega Vaccine Drive)కార్యక్రమాల్ని చేపడుతోంది. వ్యాక్సినేషన్ విజయవంతంపై మీ ప్రశంసలకు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలని వైఎస్ జగన్(Ap cm ys jagan) ..చిరంజీవికు ట్వీట్ చేశారు.

Also read: AP Exams: ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఇంటర్ పరీక్షలకు అనుమతి : సుప్రీంకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News