ఏలూరు: బయట తిరగొద్దని, ఇంట్లోనే ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. అది చివరికి పోలీసులకే ముప్పుగా మారుతోంది. ఈ క్రమంలో స్వీయ నిర్భంధం (సెల్ఫ్ ఐసోలేషన్)లో ఉండేందుకు నిరాకరించిన యువకుడిని చితక్కొట్టిన ఎస్ఐ సస్పెన్షన్ వేటుకు గురయ్యాడు. ఎస్ఐని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ సస్పెండ్ చేశారు. APలో మరో Coronavirus పాజిటివ్ కేసు
ఆ వివరాలిలా ఉన్నాయి.. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలోని పెరవలికి చెందిన యువకుడు దుబాయ్ నుంచి వచ్చాడు. స్వీయ నిర్బంధంలో ఉండాలని బయట తిరగొద్దని తొలుత గ్రామ వాలంటీర్లు సూచించారు. వారి మాట పెడచెవిన పెట్టడంతో వారు ఎస్ఐ కిరణ్ కుమార్కు సమాచారం అందించారు. ఆయన సైతం తమ సిబ్బందితో యువకుడి ఇంటికి వచ్చి సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని, లేనిపక్షంలో కరోనా వైరస్ మహమ్మారి కేసులు పెరుగుతాయని సూచించారు. వారి మాట వినకుండా యువకుడు బయట తిరగడంతో పోలీసులు విసుగెత్తిపోయారు. సాహో ప్రభాస్.. కరోనాపై పోరాటానికి భారీ విరాళం
కడుపుబ్బా నవ్వించే కరోనా మీమ్స్
యువకుడి ఇంటికి వెళ్లి మాట్లాడగా, పోలీసులను ధిక్కరించే యత్నం చేశాడు. అతడి కుటుంబసభ్యులు సైతం అయితే ఏంటి అన్నట్లుగా వ్యవహరించడంతో ఆగ్రహావేశానికి లోనయ్యారు ఎస్ఐ కిరణ్ కుమార్. దీంతో యువకుడిని చితక్కొట్టారు. అడ్డుకునే యత్నం చేసిన తల్లిదండ్రులను లాఠీతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసు శాఖపై, ఏపీ ప్రభుత్వంపై విమర్శలొచ్చాయి. విదేశాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించాలి, కానీ కొట్టడం సరికాదన్నారు. దాడికి పాల్పడ్డ ఎస్ఐని సస్పెండ్ చేస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బర్త్ డే బాయ్ Ram charan అరుదైన ఫొటోలు