AP Politics: ఏపీలో ప్రతిపక్షం ఏకం కాదా..జగన్ వ్యూహానికి బీజేపీ అధిష్టానం మద్దతుందా

AP Politics: ఏపీలో ఈసారి అధికారం ఎవరికి దక్కనుందనే విషయంపై ఎవరి అంచనాలు వారివే. ప్రతిపక్షం వ్యూహాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెక్ పెట్టేసినట్టే అన్పిస్తోంది. టీడీపీ మరోసారి ఒంటరిగానే బరిలో దిగే పరిస్థితులు కన్పిస్తున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 7, 2022, 03:24 PM IST
AP Politics: ఏపీలో ప్రతిపక్షం ఏకం కాదా..జగన్ వ్యూహానికి బీజేపీ అధిష్టానం మద్దతుందా

AP Politics: ఏపీలో ఈసారి అధికారం ఎవరికి దక్కనుందనే విషయంపై ఎవరి అంచనాలు వారివే. ప్రతిపక్షం వ్యూహాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెక్ పెట్టేసినట్టే అన్పిస్తోంది. టీడీపీ మరోసారి ఒంటరిగానే బరిలో దిగే పరిస్థితులు కన్పిస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి అధికారం చేజిక్కించుకునే ప్రయత్నాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహాలకు పదనుపెడుతున్నారు. 175కు 175 సీట్లు లక్ష్యంగా పెట్టుకోవాలని పార్టీ శ్రేణులకు పదే పదే దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎవరితోనూ పొత్తు లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలో దిగనుంది. 

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్..ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను, సమీకృతం చేస్తానని పదే పదే చెబుతున్నారు. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి. అయితే ప్రతిపక్షం ఎత్తులకు వైఎస్ జగన్ ఎక్కడికక్కడ చెక్ పెడుతున్నారు. ప్రతిపక్షం ఏకం కాకుండా ఉండేందుకే చంద్రబాబు దత్తపుత్రుడంటూ పదే పదే ఆరోపిస్తూ..మైండ్ గేమ్ ఆడుతోంది వైసీపీ. 

జగన్ వ్యూహానికి మోదీ-అమిత్ షా మద్దతు

మరోవైపు టీడీపీ జనసేన కలవకుండా కేంద్రం నుంచి వైఎస్ జగన్‌కు అన్ని విధాల సహకారం లభిస్తోందని సమాచారం. ప్రస్తుతం ఉన్న జనసేన బీజేపీ బంధమే వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగవచ్చని...టీడీపీ కలిసే పరిస్థితులు దాదాపుగా లేవనే తెలుస్తోంది. ఎందుకంటే కేంద్రంలోని మోదీ-అమిత్ షాలకు జగన్ నమ్మకమైన మిత్రుడిగా ఉన్నారు. ఆ బంధం ఆధారంగా బీజేపీ అధిష్టానం..టీడీపీతో పొత్తుకు నిరాకరించవచ్చు. ఈ దిశగా పవన్ కళ్యాణ్‌ను ఒప్పించేందుకు బీజేపీ..చిరంజీవి రూపంలో అస్త్రాన్ని సంధించనుందని సమాచారం. ఎన్నికలు దగ్గర చూసుకుని..చిరంజీవికి రాజ్యసభ ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే బీజేపీ లక్ష్యం కూడా ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేయడమే. ఏపీ ప్రతిపక్షంలో స్పేస్ ఉందని..దానిని బీజేపీ భర్తీ చేయాలని గతంలో కూడా రామ్ మాధవ్ లాంటి నేతలు వ్యాఖ్యానించారు. టీడీపీతో పొత్తుతో జగన్‌ను కోల్పోవడం బీజేపీ అధిష్టానానికి ఇష్టం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో పొత్తును జనసేన వరకే పరిమితం చేయవచ్చు. 

అంటే 2024 ఎన్నికల్లో జనసేన- బీజేపీ అలయెన్స్ మాత్రమే ఉండవచ్చు. ప్రతిపక్షం టీడీపీ, అధికార పార్టీ వైసీపీ ఒంటరిగానే బరిలో దిగే అవకాశాలున్నాయి. అదే జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు మరోసారి అధికారం దక్కే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా బీజేపీతో ఉన్న బంధాన్ని రాష్ట్ర ప్రయోజనాల వరకే కొనసాగిస్తూ..ప్రతిపక్షం ఏకం కాకుండా పైనుంచి చెక్ పెట్టే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. జగన్ వ్యూహం ఇప్పటివరకూ దాదాపుగా వర్కవుట్ అయినట్టే కన్పిస్తోంది. 

Also read: Kottu Satyanarayana: ఏపీలోని ఆలయాల్లో ఇకపై డిజిటల్ దర్శనాలు: మంత్రి కొట్టు సత్యనారాయణ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News