AP Three Capitals: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మూడు రాజధానుల రగడ ప్రారంభం కానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. పూర్తి స్థాయిలో సిద్ధమౌతున్న కొత్త వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
అమరావతి రైతులకు ( Amaravati farmers ) అందాల్సినవన్నీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఒప్పందం ప్రకారం ఆ రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలు, పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినా..రైతుల ప్రయోజనాలు ఆగకపోవడం విశేషం.
ఏపీకి మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ సభలో నిరసనలకు దిగిన 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు సోమవారం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. నేడు మంగళవారం జరిగే సమావేశాల్లో ఆ 17 మంది
టీడీపీ సభ్యులకు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి వీల్లేదు.
ఏపీకి 3 రాజధానుల బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సోమవారం ఈ బిల్లుపై సుధీర్ఘ చర్చ జరిగిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానుల ఆవశ్యకతపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివరణాత్మక ప్రసంగం ఇచ్చిన తర్వాత సభలో అధిక సంఖ్యలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఈ బిల్లుకు తమ ఆమోదం తెలిపారు. బిల్లుకు భారీ మెజార్టీతో మద్దతు లభించడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.