Vigilance Inquiry: జగన్‌ పాలనలోని అధికారులకు భారీ షాక్‌.. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

Vigilance Inquiry On AV Dharma Reddy And Thumma Vijay Kumar: గత ప్రభుత్వంలో కీలక అధికారులుగా కొనసాగిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చింది. వారిపై విచారణకు ఆదేశించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jul 10, 2024, 10:35 PM IST
Vigilance Inquiry: జగన్‌ పాలనలోని అధికారులకు భారీ షాక్‌.. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

AP Vigilance Inquiry: గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా కొనసాగిన తుమ్మ విజయ్‌ కుమార్‌ రెడ్డిపై చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారిద్దరిపై విచారణకు ఆదేశిస్తూ విజిలెన్స్‌ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. ధర్మారెడ్డి, విజయ్‌ కుమార్‌ వ్యవహార శైలిపై విజిలెన్స్‌ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. వారిద్దరూ తమ పదవీ కాలంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించడం కలకలం రేపింది.

Also Read: Revanth YS Jagan: ఏపీ రాజకీయాల్లో రేవంత్‌ రెడ్డి కల్లోలం.. వైఎస్‌ జగన్‌పై సంచలనం

 

అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మొదట తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ధర్మారెడ్డి ఉద్యోగ విరమణ చేశారు. ఇక సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా పని చేసిన విజయ్‌ కుమార్‌ ఇటీవల కేంద్ర సర్వీస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమై తిరిగి స్వరాష్ట్రం చేరుకున్నారు. ధర్మారెడ్డి అవినీతికి పాల్పడ్డారని టీడీపీ, విజయ్‌ కుమార్‌ రెడ్డిపై జర్నలిస్టులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. అవినీతికి హకరించిన ఇతర ఉద్యోగులను విచారణ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.

Also Read: Revanth YS Sharmila: 2029లో ఏపీ సీఎంగా వైఎస్‌ షర్మిల.. ఇది తథ్యం: రేవంత్‌ రెడ్డి

 

ఇరువురిపై ఆరోపణలు
టీటీడీ అధికారిగా ఉన్న సమయంలో ధర్మారెడ్డి శ్రీవాణి టికెట్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీటీడీని అడ్డం పెట్టుకుని నాటి అధికార వైఎస్సార్‌సీపీకి విరాళాలు సేకరించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అంతేకాకుండా బడ్జెట్‌తో సంబంధం లేకుండా సివిల్‌ కాంట్రాక్ట్‌ పనులు ఇచ్చారనే ఆరోపణలు ధర్మారెడ్డిపై ఉన్నాయి. ఇక సమాచార శాఖ ప్రకటనల పేరిట కోట్ల రూపాయల్లో అవినీతికి పాల్పడ్డారని మాజీ అధికారి విజయ్‌ కుమార్‌పై ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో వారిద్దరి అవినీతిపై విచారణ చేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ విచారణను వైఎస్సార్‌సీపీ తప్పుబడుతోంది. అధికారులపై కక్షసాధింపు చర్యలకు టీడీపీ ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News