Veera Simha Reddy :ఊహించని షాక్.. విడుదలైన గంటల వ్యవధిలోనే హెచ్డీ ప్రింట్ లీక్?

Veera Simha Reddy HD Print Leaked: నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా సినిమా వీర సింహారెడ్డి విడుదలైన గంటల వ్యవధిలోనే ఆన్ లైన్ లో లీక్ అవ్వడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 12, 2023, 05:09 PM IST
Veera Simha Reddy :ఊహించని షాక్.. విడుదలైన గంటల వ్యవధిలోనే హెచ్డీ ప్రింట్ లీక్?

Veera Simha Reddy HD Print Leaked: నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా సినిమా వీర సింహారెడ్డి. జనవరి 12వ తేదీన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు పెద్ద ఎత్తున వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగులో భారీ ఎత్తున ఈ సినిమాని రిలీజ్ చేశారు మేకర్స్. శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో లాల్, నవీన్ చంద్ర, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.

ఇక ఈ సినిమా ప్రీమియర్స్ ముందుగా అమెరికా లాంటి దేశంలో పడగా అక్కడ టాక్ బాగుందని ఇక్కడ వారికి కూడా తెలియడంతో పెద్ద ఎత్తున థియేటర్లకు క్యూ కట్టారు. ఒకపక్క సంక్రాంతి సెలవులు కూడా కలిసి రావడంతో ఇంటిల్లిపాది సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విడుదలైన మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంటున్న ఈ సినిమాకి తాజాగా లీకు రాయుళ్ళు షాక్ ఇచ్చారు. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే హెచ్డి ప్రింట్ ని ఆన్ లైన్ లో పైరసీ చేసి విడుదల చేశారు లీకేజ్ రాయుళ్ళు.

సాధారణంగా ఎలాంటి కొత్త సినిమా రిలీజ్ అయిన ఆయా సినిమాలను షూట్ చేసి రిలీజ్ చేస్తున్న వ్యవహారం అందరికీ తెలిసిందే. అయితే మిగతా సినిమాల కంటే భిన్నంగా ఈ సినిమా హెచ్డి ప్రింట్ తో రిలీజ్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటికే ఈ విషయాన్ని గమనించిన అభిమానులు సదరు వెబ్సైట్స్ మీద చర్యలు తీసుకోవాలి అంటూ ఈ సినిమా మేకర్స్ కు విజ్ఞప్తి చేయడంతో మేకర్స్ వీటిని అరికట్టేందుకు యాంటీ పైరసీ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

యాంటీ పైరసీ సెల్ రంగంలోకి దిగి ఈ లింక్స్ మీద దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. లింక్స్ డిజేబుల్ చేసి అవి పని చేయకుండా చేసేందుకు యాంటీ పైరసీ సెల్ రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు. ఇక గంటల వ్యవధిలోనే హెచ్డి ప్రింట్ లీక్ అవ్వడంతో వీరసింహారెడ్డి వసూళ్ల మీద ప్రభావం పడే అవకాశం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. అయితే నిజంగానే వసూళ్ల మీద ప్రభావం పడుతుందా? లేదా? అనేది మొదటి రోజు కలెక్షన్స్ బయటకు వస్తే గాని పూర్తిగా చెప్పలేం.

Also Read: Vijay Craze: తెలుగు రిలీజ్ లేకున్నా విజయ్ జోరు.. 'తునివు'ని వెనక్కు నెట్టి మరీ!

Also Read: Buddha Venkanna Counter : వర్మకు విషయం లేదా.. బుద్దా వెంకన్న అంత మాట అనేశాడు ఏంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News