AP High Court: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్, రఘురామకృష్ణంరాజు కస్టడీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court: ఏపీ హైకోర్టులో ఇవాళ ప్రభుత్వానికి వరుస షాక్‌లు తగిలాయి. జీవో నెంబర్ 1 రద్దు చేసిన ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు మరో కేసులో ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ విషయంలో కోర్టు ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 12, 2023, 08:13 PM IST
AP High Court: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్, రఘురామకృష్ణంరాజు కస్టడీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

AP High Court: ఇవాళ ఏపీ హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జీవో నెంబర్ 1 ను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చిన హైకోర్టు నర్శాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు టార్చర్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది ప్రభుత్వానికి ఊహించని పరిణామం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇవాళ్టి వరుస పరిణామాలు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయని చెప్పవచ్చు. ముందుగా జీవో నెంబర్ 1 ను కొట్టిపారేసిన హైకోర్టు ..ఈ జీవో ప్రజల ప్రాధమిక హక్కులకు భంగం కల్గించేదిగా ఉందని వ్యాఖ్యానించింది. ఆ తరువాత మరో కీలక కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి ఇబ్బంది కల్గించేవిగా ఉన్నాయి. ఈ కేసు నర్శాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసు. తనను పోలీసు కస్టడీలో టార్చర్ చేసిన అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని రఘురామకృష్ణం రాజు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ఇవాళ విచారణకొచ్చింది. 

రఘురామకృష్ణంరాజును అదుపులో తీసుకున్న సమయంలో కాల్ డేటాను స్వాధీనం చేసుకుని భద్రపర్చాలని సీబీఐకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయితే టెలీకం నిబంధనల ప్రకారం రెండేళ్లు మాత్రమే కాల్ డేటా ఉంచుతారని రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాది నౌమీన్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాల్ డేటాను ప్రిజర్వ్ చేయాల్సిందిగా ఆదేశాలివ్వాలని కోరారు. 

ఇదే కేసులో సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ హరనాథ్ వాదనలు విన్పించారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ సీఐడీ వద్ద ఉన్నందున కాల్ డేటాను సీఐడీనే సేకరించాలని వాదించారు. దాంతో పిటీషనర్ ఆరోపణే సీఐడీపై ఉన్నప్పుడు ఆ సంస్థను కాల్ డేటా సేకరించమని ఎలా ఆదేశిస్తామని కోర్టు ప్రశ్నించింది. మరోవైపు ఈ కేసులో సీఐడీ సైతం ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేసింది. కాల్ డేటా సేకరించమని చెప్పడం చట్ట విరుద్ధమంది. అటు ఇంప్లీడ్ పిటీషన్ కూడా ఇంకా అనుమతించలేదని కోర్టు తెలిపింది. 

ఈ కేసును సీబీఐకు ఇవ్వాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించలేదని కాల్ డేటా కీలకమని రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాది నౌమీన్ వివరించారు. ఈ క్రమంలో కాల్ డేటా సేకరించి భద్రపర్చాలని సీబీఐను ఆదేశించింది ఏపీ హైకోర్టు. కేసు విచారణ సమ్మర్ హాలిడేస్ తరువాతకు వాయిదా పడింది. 

Also read: AP High Court: ఏపీ ప్రభుత్వానికి షాక్, జీవో నెంబర్ 1 కొట్టివేసిన హైకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News