అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జూలై 8న పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ( AP Housing pattas ) పంపిణీ చేసే కార్యక్రమం వాయిదాపడింది. వైఎస్ఆర్ జయంతి నాడు పట్టాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం ( AP govt ) భావించింది. అయితే రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభిస్తుండటంతో దీనిని వాయిదావేసింది. ఇళ్ల స్థలాల పట్టాలను ఆగస్టు 15న లద్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana ) సోమవారం తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పట్టాలను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. Also read: AP: ఆన్ లైన్ తరగతులపై చర్యలు తప్పవు: విద్యాశాఖ
వైఎస్ఆర్ జయంతి నాడు ఇవ్వాలనుకున్నా..
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ( Y.S. Jaganmohan Reddy ) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జూన్ 8న, తన తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని సీఎం భావించారు. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ ( Coronavirus ) వ్యాప్తి కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తెల్లరేషన్ కార్డు ( White ration card ) ఉండి ఇల్లు లేని ప్రతీ నిరుపేద కుటుంబానికి సెంటు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధికారులు స్థలాలను సేకరించడంతోపాటు లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. ఇక ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయడమే తర్వాయి కార్యక్రమం కానుంది. Also read: Ap Model Schools: మోడల్ స్కూల్స్ లో అడ్మిషన్లు ప్రారంభం
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..