Amaravati land scam: చంద్రబాబుకు విచారణ ఎదుర్కొనే దమ్ముందా : మంత్రి బొత్స

Amaravati land scam: ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై అధికార పార్టీ విమర్శలు తీవ్రమౌతున్నాయి. చంద్రబాబునాయుడికి దమ్ముంటే విచారణ ఎదుర్కోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఛాలెంజ్ చేశారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2021, 04:41 PM IST
Amaravati land scam: చంద్రబాబుకు విచారణ ఎదుర్కొనే దమ్ముందా : మంత్రి బొత్స

Amaravati land scam: ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై అధికార పార్టీ విమర్శలు తీవ్రమౌతున్నాయి. చంద్రబాబునాయుడికి దమ్ముంటే విచారణ ఎదుర్కోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఛాలెంజ్ చేశారు.

అమరావతి భూ కుంభకోణం (Amaravati land scam) కేసులో సీఐడీ నోటీసులు(CID Notices) అందుకున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై విమర్శలు అధికమౌతున్నాయి. అమరావతిలో దళితుల భూముల్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు అక్రమంగా కాజేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa satyanarayana) ధ్వజమెత్తారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే  దమ్ముంటే విచారణ ఎదుర్కోవాలని బొత్స సవాల్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పట్నించే అమరావతి భూకుంభకోణంపై ప్రశ్నిస్తోందని తెలిపారు. ఒకవేళ చంద్రబాబు(Chandrababu )ఇన్‌సైడర్ ట్రేడింగ్ (Insider trading) జరపకపోతే..విచారణ ఎదుర్కోవాలి గానీ..అడ్డదారిలో కోర్టుకెళ్లి స్టే ఎందుకు తెచ్చుకోవాలని ప్రశ్నించారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr congress party) అధికారంలో వచ్చి ఇప్పటికే రెండేళ్లయిందని..ఒకవేళ తాము తప్పుచేస్తే ఇప్పటివరకూ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. వైఎస్ జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక చంద్రబాబు..బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. దళితులకు అన్యాయం జరిగితే ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. రాజధాని భూ అక్రమాలపై తమ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు చేస్తే తప్పేంటన్నారు. మరోవైపు చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే ఆర్కే విమర్శలు గుప్పించారు. భూకుంభకోణాలకు పాల్పడిన చంద్రబాబుకు నోటీసులు ఇస్తే తప్పేంటని మండిపడ్డారు. 

Also read: Insider trading: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు ఆధారాలివే..ప్రముఖుల జాబితా ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News