AP: చంద్రబాబుకు కొడాలి నాని చేసిన సవాల్ ఏంటి?

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై రాష్ట్ర మంత్రి కొడాలి నాని విమర్శల పర్వం కొనసాగుతోంది. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా మరోసారి బాబుపై నాని విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ పని చేయలేకపోతే ఇక ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ విసిరారు. 

Last Updated : Nov 8, 2020, 04:23 PM IST
AP: చంద్రబాబుకు కొడాలి నాని చేసిన సవాల్ ఏంటి?

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి ( Ap Opposition leader Chandrababu naidu )పై రాష్ట్ర మంత్రి కొడాలి నాని విమర్శల పర్వం కొనసాగుతోంది. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా మరోసారి బాబుపై నాని విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ పని చేయలేకపోతే ఇక ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ విసిరారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత , టీడీపీ అధినేత చంద్రబాబు నాయడికి..ఏపీ మంత్రి కొడాలి నాని ( Ap minister kodali nani ) సవాల్ విసిరారు. గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు ప్రభుత్వం ( Tdp government ) కట్టించిన ఒక్క ఇళ్లైనా చూపించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో 25 వేలమంది లబ్దిదారులకు..కోర్టు కేసులు లేకపోతే ఇళ్లు కట్టించి ఇస్తానని..లేకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని..ఓటు అడగడానికి కూడా రానని సవాలు విసిరారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా 25 వేల ఇళ్లు కట్టి తీరుతానని స్పష్టం చేశారు. 

ఐదేళ్ల చంద్రబాబు పాలనలో 2 లక్షల ఇళ్లు కట్టిస్తానని చెప్పి..ఒక్కఇళ్లు కూడా నిర్మించలేదని..ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల ఇళ్లు నిర్మంచడానికి ప్రయత్నిస్తుంటే అడ్డుకుంటోందని మండిపడ్డారు. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా గుడివాడ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కొడాలి నాని..సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. 

2023 ఎన్నికల లోపు లబ్దిదారులకు ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత వైఎస్ జగన్‌‌ది ( Ys jagan )..తమదని చెప్పారు నాని.  ఒకవేళ చంద్రబాబు లాంటి వాళ్లు అడ్డుపడితే జగన్నాథ రథచక్రాల కింద నల్లుల్లా నలిపేస్తామని ధ్వజమెత్తారు. ఒక్కో నియోజకవర్గంలో 20వేల మంది పేదలకు ఇళ్లను వైసీపీ ప్రభుత్వం ( Ycp Government ) ఇస్తే.. 2023లో టీడీపీకు డిపాజిట్లు కూడా రావన్నారు. అందుకే ఆ భయంతోనే చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టుకు వెళ్లి 30 లక్షల ఇళ్ల కేటాయింపును అడ్డుకుంటూ స్టేలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. Also read: Jagan Letter Issue: కోర్టు ధిక్కారణ చర్యలకు అనుమతించలేను: అటార్నీ జనరల్

Trending News