ఏపీ ( AP ) ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ( Supreme court Chief justice) కు రాసిన లేఖపై కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ జగన్ పై కోర్టు ధిక్కరణ చర్యలకు సమ్మతించలేనంటూ మరోసారి స్పష్టం చేశారు భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan ) సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్ఏ బాాబ్డేకు ( CJI SA Bobde ) రాసిన లేఖ దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఏపీ హైకోర్టు ( Ap High court ) ను సుప్రీంకోర్టు జడ్జి ఎన్ వి రమణ ( Justive n v ramana ) ప్రభావితం చేస్తున్నారని..రాష్ట్ర ప్రభుత్వాన్ని ( Ap Government ) అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ ఏపీ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు సీజేకు లేఖ రాశారు. ఈ లేఖ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడమే కాకుండా..కొంతమంది సమర్ధించారు. మరి కొంతమంది విమర్శించిన పరిస్థితి. చట్టం ముందు ఎవ్వరూ అతీతులు కాదని చాలామంది వాదించారు. ఈ లేఖను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు అజేయ కల్లాం మీడియాకు విడుదల చేశారు.
దీంతో ఈ అంశాన్ని కోర్టు ధిక్కారం కింద పరిగణిస్తూ వైయస్ జగన్, అజేయ కల్లంలపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చెయ్యాలని అభ్యర్థిస్తూ సుప్రీం కోర్టు న్యాయవాది, బీజేపీ నాయకుడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ రాసిన లేఖను పరిగణలోకి తీసుకునేందుకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ( Attorney general kk venugopal ) ఇప్పటికే ఓసారి నిరాకరించారు. రెండవసారి ఇదే విషయంపై ఉపాధ్యాయ లేఖ రాయగా..మరోసారి ఆయన తిరస్కరించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోర్టు ధిక్కరణ చర్యలకు సమ్మతి తెలియచేయడం సాధ్యపడదన్న తన నిర్ణయాన్ని పునః సమీక్షించేందుకు అటార్నీ జనరల్ కే కే వేణుగోపాల్ నిరాకరించారు.
అయితే తాను అసమ్మతి తెలియజేసినప్పటికీ.. సదరు న్యాయవాది ఉపాధ్యాయ వాస్తవాలను సుప్రీం కోర్టు ( Supreme court ) ఎదుట హాజరుపరుస్తూ, సుమోటో యాక్షన్ కోరడానికి ఎటువంటి అడ్డూ లేదని వేణు గోపాల్ స్పష్టం చేశారు. Also read: Shiv sena vs BJP: అర్నాబ్ వ్యవహారంలో బీజేపీ వర్సెస్ శివసేన