/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

అంతర్వేది ( Antarvedi ) ఘటన నేపధ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఏపీ పోలీసు ( Ap Police ) అప్రమత్తమైంది. చలో అంతర్వేది కార్యక్రమాలకు అనుమతి లేదని..ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరశింహ స్వామి ( Antarvedi Temple Chariot Fire ) ఆలయ రధం దగ్దమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాజకీయ లబ్ది కోసం పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. చలో అంతర్వేది ( Chalo antarvedi ), చలో అమలాపురం కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో ఏపీ పోలీసు అప్రమత్తమైంది. ఇలాంటి కార్యక్రమాలకు అనుమతులు లేవని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు ( Eluru range DIG kv Mohanrao ) స్పష్టం చేశారు. మరోవైపు ప్రశాంతమైన కోనసీమ వాతావరణంలో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ..అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ కె. నారాయణ నాయక్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని...నిందితులెంతటివారైనా పట్టుకుని శిక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 

ప్రస్తుతం కోవిడ్ 19 ( Covid 19 ) నిబంధలతో పాటు అదనంగా కోనసీమలో సెక్షన్ 34, 144 లు అమల్లో ఉన్నాయన్నారు. ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేసేందుకు ఎవరికీ అనుమతుల్లేవన్నారు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు తప్పవని సూచించారు. ప్రజలు అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకు దూరంగా ఉండాలని కోరారు. ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు.

అంతర్వేద రధం దగ్దం ఘటనపై ఇప్పటికే ఫోరెన్సిక్‌ నిపుణులు ఆధారాలు సేకరించారని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని డీఐజీ తెలిపారు. అంతర్వేది ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రజలు ప్రశాంతంగా ఉన్నారన్నారు. అనవసరమైన పుకార్లను కూడా నమ్మవద్దని సూచించారు. Also read: Vijayawada Flyover: కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవం మళ్లీ వాయిదా

Section: 
English Title: 
Ap police said, No permission for Chalo Antarvedi
News Source: 
Home Title: 

Antarvedi: చలో అంతర్వేదికి అనుమతుల్లేవు..ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Antarvedi: చలో అంతర్వేదికి అనుమతుల్లేవు..ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Antarvedi: చలో అంతర్వేదికి అనుమతుల్లేవు..ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
Publish Later: 
No
Publish At: 
Friday, September 18, 2020 - 12:17
Created By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman