AP Schools Corona Tension : ఏపీ పాఠశాలల్లో కొవిడ్ కల్లోలం.. ఒక్కరోజులోనే స్కూళ్లలో పెద్ద ఎత్తున కేసులు

AP Schools report 17 New Covid Positive Cases : ఆంధ్రప్రదేశ్‌లోని పలు పాఠశాలల్లో కొవిడ్ భయాందోళన మొదలైంది. ప్రకాశం జిల్లా స్కూళ్లలో ఒక్కరోజే 17 కొవిడ్ కేసులు వెలుగులోకి రావడంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 07:53 PM IST
  • ఆంధ్రప్రదేశ్‌లోని పలు పాఠశాలల్లో కొవిడ్ కల్లోలం
  • ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూళ్లలో 17 కొవిడ్ పాజిటివ్‌ కేసులు నమోదు
  • 15 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు సిబ్బందికి కరోనా
AP Schools Corona Tension : ఏపీ పాఠశాలల్లో కొవిడ్ కల్లోలం.. ఒక్కరోజులోనే స్కూళ్లలో పెద్ద ఎత్తున కేసులు

Corona tension in Andhra Pradesh schools : ఆంధ్రప్రదేశ్‌లోని పలు పాఠశాలల్లో (schools) కొవిడ్ (covid) కల్లోలం సృష్టిస్తోంది. ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూళ్లలో 17 కొవిడ్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు (Students parents) ఆందోళనకు గుర​వుతున్నారు. కొవిడ్ బారినపడిన వారిలో 15 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. 

ప్రకాశం జిల్లాలోని (Prakasam District) ఒంగోలు డీఆర్ఎం, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, అద్దంకి మండలం తిమ్మాయపాలెం, చిన్నగంజాం జెడ్పీ హైస్కూల్‌లో ఇద్దరికి కరోనా సోకింది. అలాగే ఒంగోలు కేంద్రీయ విద్యాలయ, కనిగిరి నందన మారెళ్ల, మార్కాపురం శారదా ఎయిడెడ్ స్కూల్, సింగరాయకొండ మండలం కలికివాయి, పంగులూరు మండలం రేణిగంవరం, టంగుటూరు మండలం కొణిజేడు, యద్దనపూడి మండలం యనమదల, సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం, గన్నవరం ఎంపీపీఎస్ స్కూళ్లలో (schools) ఒకొక్క టీచర్‌‌ చొప్పున కొవిడ్ బారినపడ్డారు.

అలాగే త్రిపురాంతకం మండలం మేడపి, యద్దనపూడి మండలం పూనూరు స్కూళ్లలో పాఠశాల సిబ్బందికి కరోనా (Corona) సోకింది. ఇక గడిచిన 24 గంటల్లో 41,713 కొవిడ్ టెస్ట్‌లు (Covid Tests) నిర్వహించగా.. 10,057 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.

అయితే కరోనా కేసులు (Corona cases) పెరుగుతోన్న సమయంలో ప్రస్తుతం ఏపీలో స్కూల్స్‌ (AP Schools‌) కొనసాగిస్తున్నారంటూ కొందరు తప్పుపడుతున్నారు. దీంతో పాఠశాలల్లో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయంటున్నారు.

Also Read : Paracetamol dose: పారాసిటమోల్ ఏయే వయస్సుల వారికి ఎంత డోస్ అవసరమో తెలుసా?

కొవిడ్ కేసులు (Covid cases) పెరుగుతోన్న క్రమంలో తెలంగాణలో జనవరి చివరి వరకు టీఎస్ సర్కార్ సెలవులు ప్రకటించింది. అయితే ఏపీలో మాత్రం సంక్రాంతి తర్వాత కూడా స్కూల్స్ ఓపెన్ (Schools open‌) అయ్యాయి. దీంతో ఏపీలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో (Schools‌) కొవిడ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

Also Read : IND vs SA 1st ODI Live Score: రాణించిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 297

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News