AP Voters Final List: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. మార్చ్ -ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఓటర్ల జాబితాపై దృష్టి సారించింది. మరో 12 రోజుల్లో అంటే జనవరి 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనుంది ఈసీ.
ఏపీ ఎన్నికల్లో ఓటేసేందుకు సిద్ధమౌతుంటే ముఖ్య గమనిక. మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకుంటే ఓటు హక్కు నమోదు చేసేందుకు కేవలం 10 రోజులే మిగిలుంది. జనవరి 22వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. ఏపీలో మూడ్రోజులపాటు పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఎన్నికల విధులు నిర్వహించే అధికార్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించింది. ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ మీడియాతో ఎన్నికల ఏర్పాట్లపై వివరాలు అందించారు.
ఏపీ ఓటర్ల తుది జాబితా జనవరి 22న విడుదల చేయనున్నామని చెప్పారు. ఏపీలో మొత్తం 4.07 కోట్ల ఓటర్లున్నారు. అందులో 2.07 కోట్లు మహిళా ఓటర్లు కాగా, 1.99 కోట్ల మంది పురుషులున్నారు. వీరిలో వందేళ్లు దాటిన వృద్ధులు 1,174 మంది ఉన్నారు. సీనియర్ సిటిజన్లకు ఇంట్లోంచే ఓటేసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఇలా ఏపీలో 5.8 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఏపీలో ఈసారి 7.88 లక్షల మంది తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉండటం, పారా మిలిటరీ బలగాలతో ఎన్నికల నిర్వహణ, ఎన్నికల్లో ధన ప్రవాహం నియంత్రణ అంశాలపై ఫిర్యాదులు వచ్చినట్టు రాజీవ్ కుమార్ తెలిపారు. వివిధ పార్టీలు అందించిన ఫిర్యాదుల్ని పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే బోగస్ ఓట్ల విషయంలో చర్యలు తీసుకున్నామని చెప్పారు. 5.64 లక్షల బోగస్ ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. మార్పులు చేర్పులు పూర్తవడంతో ఏపీ తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది.
Also read: AP Elections 2024: జనసేన, టీడీపీకి బీజేపీ ఝలక్..? ఏపీలో ఒంటరిగా ఎన్నికలకు సిద్ధం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook