అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల ఫలితాల మెరిట్ లిస్ట్, మార్కుల జాబితా విడుదలయ్యాయి. పోస్టులకు ఎంపికైన వారి జాబితాను రాష్ట్ర పోలీసు నియామక మండలి (ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్) వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. మార్కులు, మెరిట్ అభ్యర్థుల జాబితా పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు నియామక మండలి ఛైర్మన్ అమిత్‌గార్గ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
అభ్యర్థుల రాత పరీక్ష, ఇంటర్వ్యూ మార్కులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే నియామక మండలి మెయిల్ ఐడీకి ఫిబ్రవరి 20వ తేదీ లోపు వివరాలు కోరాలని సూచించారు. కాగా, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఫిబ్రవరి 18న విడుదల చేశారు. ఖాళీగా ఉన్న 50 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి గతేడాది నవంబరు 17న రాతపరీక్షలు నిర్వహించారు. 6 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 2,488 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 547 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ప్రాథమిక ‘కీ’ని నవంబరు 17న విడుదల చేశారు. రాతపరీక్షలో మొత్తం 495 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. దాదాపు 100 మందిని 1 : 2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు. గత నెలలో ఇంటర్వ్యూ నిర్వహించి తాజాగా ఫలితాలను విడుదల చేశారు.
అధికారిక వెబ్ సైట్ కోసం క్లిక్ చేయండి
మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి