AP Minister Perni Nani press meet: అమరావతి: బ్లాక్ మార్కెట్‌ని ప్రోత్సహించే దిక్కుమాలిన సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కనిపిస్తోందని మంత్రి పేర్ని నాని అన్నారు. బీజేపి, టీడీపీ, జనసేన పార్టీ.. ఈ మూడు పార్టీలు కూడా బ్లాకులో టికెట్లు అమ్ముకుని ప్రభుత్వాన్ని కూడా కళ్లు మూసుకొమ్మని చెబుతారని అసహనం వ్యక్తంచేసిన ఆయన... బ్లాకులో టికెట్లు అమ్ముకునే దుస్థితికి వ్యవస్థ దిగజారడానికి చంద్రబాబు ప్రభుత్వం కారణం కాదా అని ప్రశ్నించారు. మైకు పట్టుకుంటే చాలు నీతులు చెప్పే ఓ హీరో కూడా ఈ నీతిమాలిన పనులు చేయడం ఏంటని మంత్రి విస్మయం వ్యక్తంచేశారు.
చట్ట ప్రకారం పనిచేసుకోలేరా ? దరఖాస్తు చేసుకుంటే మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు ?
ఇవాళ ప్రభుత్వం నిర్ధేశించిన జీవోని నిలుపుదల చేసి తాత్కాలికంగా జిల్లా జాయింట్ కలెక్టరుకి దరఖాస్తు చేసుకుని అనుమతి తీసుకోవాల్సిందిగా హై కోర్టు చెప్పినప్పుడు సినిమా వాళ్లు ఆ పని ఎందుకు చేయడం లేదని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. కోర్టు తీర్పుకి అనుగుణంగా అధికారులకు దరఖాస్తు చేసి అనుమతులు తెచ్చుకుంటే మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారని మండిపడ్డారు. చట్ట ప్రకారం అలాంటివేవీ చేయకుండానే ప్రభుత్వంపై బురద జల్లేందుకు కుట్ర చేయడం దుర్మార్గం అని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు.
మంత్రి గౌతం రెడ్డి చనిపోయిన బాధలో ఉన్నప్పుడు ఈ రాజకీయాలేంటి ?
ఒకవైపు మంత్రి గౌతం రెడ్డి చనిపోయిన బాధలో మేముంటే.. ఆ బాధను పట్టించుకోకుండా తన మనుషుల చేత ప్రభుత్వంపై ఆరోపణలు చేయిస్తున్న చంద్రాబాబును ఏమనాలో అర్థం కావడం లేదన్నారు మంత్రి పేర్ని నాని. మంత్రి గౌతం రెడ్డి చనిపోయారని ఆడియో ఫంక్షన్‌ని ఒక్క రోజుకు వాయిదా వేసుకున్నప్పుడు సినిమా విడుదలను కూడా మరో రెండు రోజులు వాయిదా వేసుకుంటే ఏమైందని భీమ్లా నాయక్ చిత్ర నిర్మాతలను ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఏనాడైనా జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి ఇంతలా ఆరాటపడ్డారా ?
భీమ్లా నాయక్ మూవీ విషయంలో నారా లోకేష్ ప్రభుత్వంపై చేస్తోన్న ఆరోణల గురించి స్పందిస్తూ.. నారా లోకేష్, చంద్రబాబులను మంత్రి పేర్ని నాని ఏకిపారేశారు. ఇవాళ పవన్ కల్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని తహతహలాడుతున్నామని చెబుతున్న నారా లోకేష్... ఏనాడైనా తన కుటుంబం నుంచే వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఇలా ప్రమోట్ చేశారా అని సూటిగా ప్రశ్నించారు. ఎన్టీఆర్ సినిమా గురించి ఏనాడూ, ఏమీ కామెంట్ చేయని తండ్రీ కొడుకులు (చంద్రబాబు నాయుడు, నారా లోకేష్) ఇవాళ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీ గురించి ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటే వాళ్ల ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవచ్చని మంత్రి పేర్ని నాని అసహనం వ్యక్తంచేశారు. కొంత మంది సినీ ప్రముఖుల గురించి, వారికి అండగా నిలుస్తున్నామని చెబుతూ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్న రాజకీయ నాయకులు, ఇంకొన్ని మీడియా సంస్థల గురించి మంత్రి పేర్ని నాని తన ప్రసంగంలో ప్రస్తావించారు. మంత్రి పేర్ని నాని (AP Minister Perni Nani press meet) ఇంకా ఏమేమన్నారో వారి మాటల్లోనే చూద్దాం.
Also read : Petrol Prices Hikes: సామాన్యులపై పెట్రో మంట.. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.150!
Also read : Watch Video: భీమ్లా నాయక్ సినిమాపై సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ రియాక్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook