Punch Prabhakar : పంచ్‌ ప్రభాకర్‌ అరెస్ట్‌కు బ్లూ నోటీసు జారీ చేసిన సీబీఐ

Punch Prabhakar Social Media post case : పంచ్‌ ప్రభాకర్‌ను అరెస్టు చేసేందుకు సీబీఐ బ్లూ నోటీసు (CBI blue notice) జారీచేసింది. పంచ్‌ ప్రభాకర్‌ను (punch prabhakar) అరెస్ట్ చేసేందుకు సీబీఐ ఉచ్చు బిగుస్తోంది. ఇదే కేసులో మరో ఆరోగురిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మొత్తం 11 మంది నిందితులపై సీబీఐ చార్జిషీట్ (CBI chargesheet) దాఖలు చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2021, 01:02 PM IST
  • పంచ్‌ ప్రభాకర్‌ను అరెస్టు చేసేందుకు సీబీఐ బ్లూ నోటీసు జారీ
  • ఇంటర్ పోల్ ద్వారా బ్లూ నోటీసులు
  • ఇదే కేసులో మరో ఆరుగురిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు
  • మొత్తం 11 చార్జిషీట్ ల దాఖలు
Punch Prabhakar : పంచ్‌ ప్రభాకర్‌ అరెస్ట్‌కు బ్లూ నోటీసు జారీ చేసిన సీబీఐ

CBI issued blue notice to punch prabhakar through interpol : న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను దూషిస్తూ, కించపరుస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచ్‌ ప్రభాకర్‌ను అరెస్టు చేసేందుకు సీబీఐ బ్లూ నోటీసు (CBI blue notice) జారీచేసింది. పంచ్‌ ప్రభాకర్‌ను (punch prabhakar) అరెస్ట్ చేసేందుకు సీబీఐ ఉచ్చు బిగుస్తోంది. ఇదే కేసులో మరో ఆరోగురిపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. మొత్తం 11 మంది నిందితులపై సీబీఐ చార్జిషీట్ (CBI chargesheet) దాఖలు చేసింది. అవుతు శ్రీధర్‌రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, గూడ శ్రీధర్‌రెడ్డి, శ్రీనాథ్ సుస్వరం, దరిస కిషోర్ రెడ్డి, అజయ్ అమృత్‌లపై విడివిడిగా సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకు దురుద్దేశాలు, కులాలు, అవినీతి ఆరోపణలు ఆపాదిస్తూ వారి ప్రాణాలకు హాని కలిగిస్తామని బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనేది వీరందరిపై ఉన్న ప్రధాన అభియోగం.

పంచ్ ప్రభాకర్ యూట్యూబ్‌ ఛానెల్‌ను (Punch Prabhakar YouTube Channel) కూడా బ్లాక్‌ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 53 మొబైల్‌ నంబర్ల కాల్‌ డిటేయిల్స్ రికార్డు ను సేకరించినట్లు సీబీఐ తెలిపింది. కేసు (Case) నమోదు చేశాక చాలామంది తాము పెట్టిన అనుచిత పోస్టులు తొలగించినందున డిజిటల్‌ ఫోరెన్సిక్‌ టెక్నాలజీతో ఫ్రూఫ్స్ సేకరించడంపై దృష్టి సారించింది. ఎంఎల్‌ఏటీ (మ్యూచువల్‌ లీగల్‌ అసిస్టెన్స్‌ ట్రీటీస్‌) సహకారంతో నిందితుల ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్‌, పోస్టులు, ట్విటర్‌ ఖాతాలు, ట్వీట్‌లు, (Tweets) యూట్యూబ్‌ వీడియోలు తదితరాల నుంచి సమాచారం సేకరిస్తోంది.

Also Read : Venkatesh Drishyam 2: వెంకటేష్ ‘దృశ్యం 2’ టీజర్ రిలీజ్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కాగా ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ ఇంటర్వ్యూలు, ప్రసంగాలు, సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాల్ని ఆపాదిస్తూ, అభ్యంతకర వ్యాఖ్యలు (Offensive comments) చేస్తున్నారంటూ హైకోర్టు అప్పటి రిజిస్ట్రార్‌ జనరల్‌ ఫిర్యాదుపై గతేడాది ఏప్రిల్‌ 16 నుంచి జులై 17 మధ్య సీఐడీలోని (CID)  సైబర్‌ నేరాల విభాగం (Cybercrime Division) 12 కేసులు పెట్టింది. 16 మందిని నిందితులుగా పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు గతేడాది నవంబరు 11న సీబీఐ ఈ కేసు (Case) దర్యాప్తును చేపట్టింది.

Also Read : Devon Conway Injury: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు న్యూజిలాండ్ జట్టుకు షాక్.. కీలక ఆటగాడు దూరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News