న్యూ ఢిల్లీ: కేంద్ర పన్నుల్లో ( Central taxes ) మే నెల రాష్ట్రాల వాటాలను ( Tax shares of States) కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 46,038.70 కోట్లు విడుదల చేయగా అందులో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ వాటాగా రూ. 982 కోట్లు ( Telangana share ) కేటాయించగా ఆంధ్రప్రదేశ్ వాటా కింద రూ. 1,892.64 కోట్లు ( Andhra Pradesh share ) మంజూరయ్యాయి. ఏప్రిల్ నెలలో విడుదల చేసిన కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాలకు ఇవి సమానం. కేంద్రం వసూలు చేసే సుంకాల్లో 42 శాతం రాష్ట్రాల వాటాల కింద కేటాయించాల్సిందిగా 14వ ఆర్థిక సంఘం సూచించగా.. 15వ ఆర్థిక సంఘం ఆ మొత్తాన్ని 41 శాతానికి కుదించి మిగతా 1 శాతాన్ని కొత్తగా ఏర్పడిన జమ్ము, కశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన సంగతి తెలిసిందే. అలా 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల మేరకే ఈ కేటాయింపులు జరిగాయి. ( Also read : ఏపీకి రూ.1,892.64 కోట్లు, తెలంగాణకు 982 కోట్లు )
కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ కేటాయింపుల్లో అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్‌కి రూ. 8,255.19 కోట్లు, బిహార్‌కి రూ. 4,631.96 కోట్లు, వెస్ట్ బెంగాల్‌కి రూ.3,461.65 కోట్లు, గుజరాత్‌కి రూ.1,564.4 కోట్లు, అస్సాం రాష్ట్రానికి రూ.1,441.48 కోట్లు విడుదల అయ్యాయి. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలన్నీ ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న తరుణంలో విడుదల చేస్తున్న ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్-19 కి ( Fight against COVID-19 ) వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి ఉపయోగపడతాయని కేంద్రం అభిప్రాయపడింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..