Supreme Court: ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. క్వాష్ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. సుప్రీంకోర్టు ఇవాళ ఈ కేసును లిస్టింగ్ చేసి బెంచ్ కేటాయించినా..ఆ బెంచ్ కాస్తా నాట్ బిఫోర్ మి అని ప్రస్తావించింది. అసలేం జరిగిందంటే..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి చంద్రబాబు న్యాయవాదులు క్వాష్ పిటీషన్‌పైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. తొలుత ఏసీబీ కోర్టులో క్వాష్ కోసం వాదించి విఫలం కావడంతో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో సిద్ధార్ధ్ లూధ్రాతో పాటు హరీష్ సాల్వే కూడా వాదనలు విన్పించారు. అక్కడ కూడా నిరాశే ఎదురు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఇవాళ విచారణకు లిస్టింగ్ చేసి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి బెంచ్‌కు కేటాయించింది.
ఇవాళ ఈ పిటీషన్‌పై విచారణ జరుగుతుందని ఆశిస్తున్న తరుణంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచ్ ఈ కేసు విచారణకు విముఖత వ్యక్తం చేసింది. బెంచ్‌లో సభ్యుడైన జస్టిస్ ఎస్విఎన్ భట్టి నాట్ బిఫోర్ మి అనడంతో మళ్లీ మొదటికి చేరింది. కేసును మరో బెంచ్‌కు బదిలీ చేసింది సుప్రీంకోర్టు. జస్టిస్ ఎస్విఎన్ భట్టి ఏపీ చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో తన ముందు ఈ కేసు రావడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. దాంతో కేసు బెంచ్ మారడమే కాకుండా విచారణ కూడా వచ్చే వారానికి వాయిదా పడింది.
ఎందుకంటే సుప్రీంకోర్టుకు రేపట్నించి వరుసగా ఐదురోజులు సెలవులున్నాయి. తిరిగి సుప్రీంకోర్టు తెర్చుకునేది ఆక్టోబర్ 3వ తేదీనే. అంటే ఈ కేసు విచారణ ఏ బెంచ్‌కు కేటాయిస్తారు, ఎప్పుడు జరుపుతారనేది బహుశా ఆ రోజే తెలిసే అవకాశాలున్నాయి. మరోవైపు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా..సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ముందు మెన్షన్ కోసం ప్రయత్నిస్తున్నారు.
Also read: Judges Trolling: న్యాయమూర్తులపై ట్రోలింగ్, గోరంట్ల, బుద్ధా సహా 26 మందికి నోటీసులు జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook